Lok Sabha Elections: ఏప్రిల్‌ 16న లోక్‌సభ ఎన్నికలు?

Lok Sabha Elections: ఏప్రిల్‌ 16 కచ్చితమైన తేదీ కాదని వివరణ ఇచ్చిన సీఈవో

Shekhar G
Published on: 24 Jan 2024 10:05 AM IST
Lok Sabha Elections On April 16? Delhi election office clears the confusion
X

Lok Sabha Elections: ఏప్రిల్‌ 16న లోక్‌సభ ఎన్నికలు?

Lok Sabha Elections: జిల్లాస్థాయి అధికారులకు ఢిల్లీ చీఫ్ ఎన్నికల అధికారి పంపిన ఓ నోట్‌ వచ్చే సార్వత్రిక ఎన్నికల తేదీలపై చర్చకు దారితీసింది. ఢిల్లీలో లోక్‌సభ ఎన్నికలు ఏప్రిల్‌ 16న జరగవచ్చని కేంద్ర ఎన్నికల సంఘం తాత్కాలిక సూచన జారీ చేసింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఎన్నికలకు అవసరమైన ప్రణాళికలు తయారు చేసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారులకు ఢిల్లీ ఎన్నికల చీఫ్ అధికారి కార్యాలయానికి చెందిన అసిస్టెంట్‌ చీఫ్‌ ఎలక్టోరల్‌ ఆఫీసర్‌ ఈనెల 19న జారీచేసిన సర్క్యులర్‌ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

దీంతో ఢిల్లీలో ఎన్నికలు ఏప్రిల్‌ 16న జరగబోతున్నట్లు దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. ఈ అంశం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారి రకరకాల ఊహాగానాలు ప్రచారంలోకి రావడంతో సీఈవో కార్యాలయం స్పష్టత ఇచ్చింది. జిల్లా స్థాయిలో ఎన్నికలకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవడానికి అధికారులకు ఒక గడువిస్తూ ఆ తేదీని పేర్కొన్నామని, అంతే తప్ప అది కచ్చితమైన తేదీ కాదని తెలిపింది.

Shekhar G

Shekhar G

Next Story