సంపూర్ణ లాక్‌డౌన్ దిశగా దేశ ఆర్ధిక రాజధాని

Lockdown in Maharashtra Soon
x

సంపూర్ణ లాక్‌డౌన్ దిశగా దేశ ఆర్ధిక రాజధాని

Highlights

Maharashtra: కోవిడ్ కల్లోలంతో మహారాష్ట్ర ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఇవాళ 36వేల 265 మంది కోవిడ్ బారిన పడ్డారు.

Maharashtra: కోవిడ్ కల్లోలంతో మహారాష్ట్ర ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఇవాళ 36వేల 265 మంది కోవిడ్ బారిన పడ్డారు. ఇక మహారాష్ట్రలో కరోనా విజృంభిస్తుండటంతో సంపూర్ణ లాక్‌డౌన్‌ విధించే దిశగా ఆలోచిస్తోంది మహారాష్ట్ర. ముంబైలో 20వేలకుపైగా కేసులు నమోదు అవుతుండగా, సంపూర్ణ లాక్‌డౌన్‌ విధిస్తామంటూ ఇది వరకే మేయర్‌ కిశోరీ పెడ్నేకర్‌ ప్రకటించారు. ఇప్పుడు ఆ సంఖ్య దాటిపోవడంతో అనేక ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్లుగా గుర్తించారు. ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని సంపూర్ణ లాక్‌డౌన్‌ విధించే దిశగా ఆలోచనలు చేస్తోంది మహారాష్ట్ర ప్రభుత్వం.

మరోవైపు కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై వైద్యఆరోగ్య శాఖ మంత్రి అధికారులతో చర్చించారు. అయితే రాష్ట్రవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించడం ఇప్పటికిప్పుడు సాధ్యం కాకపోవచ్చని, దీనిపై మరింత సమాచారాన్ని సేకరించి నిర్ణయం తీసుకోవాలని అన్నారు. అలాగే కొత్త కేసుల సంఖ్య భారీగా నమోదు అవుతున్న నేపథ్యంలో మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో సంపూర్ణ లాక్‌డౌన్ విధించాలని ప్రాథమికంగా చర్చించామని స్పష్టం చేశారు. ఇలాగే కేసుల సంఖ్య మరింతగా పెరిగితే లాక్‌డౌన్‌ విధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అధికారులు అభిప్రాయపడుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories