Lockdown: ఈ నెల 10 నుంచి కర్నాటకలో లాక్‌డౌన్‌

Lockdown: దేశంలో లాక్‌డౌన్‌ విధించిన రాష్ట్రాల జాబితాలో కర్నాటక కూడా చేరిపోయింది.

Arun Chilukuri
Published on: 8 May 2021 10:30 AM IST
Lockdown In Karnataka For 2 Weeks
X

Lockdown: ఈ నెల 10 నుంచి కర్నాటకలో లాక్‌డౌన్‌

Lockdown: దేశంలో లాక్‌డౌన్‌ విధించిన రాష్ట్రాల జాబితాలో కర్నాటక కూడా చేరిపోయింది. ఈ నెల 10 నుంచి 25 వ తేదీ వరకు రెండు వారాల పాటు సంపూర్ణ లాక్‌ డౌన్‌ విధిస్తున్నట్లు కర్నాటక ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ఉత్తర్వులు కూడా వెలువడ్డాయి. ప్రస్తుతం రాష్ట్రంలో పాక్షిక లాక్‌డౌన్‌ అమలవుతోంది. దీనివల్ల ఎలాంటి ప్రయోజనం లేదని ప్రభుత్వం భావిస్తోంది. రోజు వారీ కేసులు దాదాపు 50 వేలకు చేరుకున్నాయి. బెంగళూరు మహానగరంలోనే పాతిక వేల వరకు కొత్త కేసులు రోజూ వస్తున్నాయి. కరోనా కేసుల పెరుగుదలను కట్టడి చేయడానికి పూర్తి లాక్‌డౌన్ విధిస్తామని ముఖ్యమంత్రి యడ్యూరప్ప నిన్న ఉదయమే సూచనా ప్రాయంగా వెల్లడించారు. సాయంత్రానికి ఉత్తర్వులు వచ్చేశాయి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story