Lockdown: ఢిల్లీలో మరో వారం పాటు లాక్ డౌన్

Lockdown: క‌రోనా వ్యాప్తి దృష్ట్యా ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు.

Arun Chilukuri
Published on: 1 May 2021 8:32 PM IST
Lockdown in Delhi is Being Extended by one Week
X

LockDown: ఢిల్లీలో మరో వారం పాటు లాక్ డౌన్

Lock Down: క‌రోనా వ్యాప్తి దృష్ట్యా ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. మ‌రో వారం రోజుల పాటు లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్న‌ట్టు సీఎం కేజ్రీవాల్ ట్విట్ట‌ర్ వేదిక‌గా ప్ర‌క‌టించారు. ఢిల్లీలో మరో వారం రోజుల పాటు లాక్‌డౌన్‌ను పొడగిస్తున్నాం అని సీఎం కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. గతంలోనూ ఢిల్లీలోని కరోనా తీవ్రత దృష్ట్యా లాక్‌డౌన్ పొడగిస్తున్నట్లు ప్రకటించారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఏప్రిల్ 19 నుంచి కేజ్రీవాల్ సర్కార్ లాక్‌డౌన్ విధించిన విషయం విదితమే. ఢిల్లీలో కరోనా విశ్వరూపం చూపిస్తోంది. రోజుకు దాదాపు 25వేలకు పైగా కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి. వందల మంది వైరస్‌కు బలవుతున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story