Karnataka: కర్నాటక మైసూరులో చిరుత స్వైర విహారం

Karnataka: కనకనగర్‌లో కనిపించిన వారిపై దాడి

Rama Rao
Published on: 4 Nov 2022 2:19 PM IST
Leopard Attack Residents in Karnataka Mysore | Telugu News
X

Karnataka: కర్నాటక మైసూరులో చిరుత స్వైర విహారం

Karnataka: కర్నాటకలోని మైసూరులో చిరుత స్వైర విహారం చేసింది. కనకనగర్‌లో సంచరిస్తున్న చిరుతను గమనించిన స్థానికులు తరిమికొట్టేందుకు ప్రయత్నించారు. ఈలలు వేస్తూ కేరింతలు కొడుతూ వెంటపడ్డారు. దీంతో భయపడ్డ చిరుత కనిపించిన వారిపై దాడి చేసింది. ఒక ఇంటి నుంచి మరో ఇంటిపైకి దూకుతూ జనాలను పరుగులు పెట్టించింది. రోడ్డు మీద బైక్‌పై వెళుతున్న వ్యక్తిపై పంజా విసిరింది. బండితోపాటు వ్యక్తి కిందపడిపోయాడు. స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.

అంతలో చిరుతను వెళ్లగొట్టేందుకు ప్రయత్నించిన మరో వ్యక్తిపైకి ఎదురు దాడి చేసింది. స్థానికుల సమాచారంతో అప్పటికే అక్కడికి చేరుకున్న ఫారెస్ట్‌ సిబ్బంది చిరుతను వల వేసి పట్టుకున్నారు. బోనులో బంధించి అడవిలోకి తీసుకెళ్లడంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు.

Rama Rao

Rama Rao

Next Story