Aadhaar: అపాయింట్‌మెంట్ లేకుండా ఆధార్‌ అప్‌డేట్‌.. ఎలాగో తెలుసా..?

Learn the Process by Which Aadhaar can be Updated Without an Appointment
x

Aadhaar: అపాయింట్‌మెంట్ లేకుండా ఆధార్‌ అప్‌డేట్‌.. ఎలాగో తెలుసా..?

Highlights

Aadhaar: పుట్టిన పిల్లాడి నుంచి పండు ముసలివరకు అందరికి ఆధార్ కార్డ్‌ అవసరం. ఏ పనిచేయాలన్నా ఆధార్‌ కార్డుతో లింకప్‌ అయి ఉంటుంది.

Aadhaar: పుట్టిన పిల్లాడి నుంచి పండు ముసలివరకు అందరికి ఆధార్ కార్డ్‌ అవసరం. ఏ పనిచేయాలన్నా ఆధార్‌ కార్డుతో లింకప్‌ అయి ఉంటుంది. అంతేకాదు ఆధార్‌ వ్యక్తి చిరునామాగా ఉపయోగపడుతుంది. ప్రభుత్వ పథకాల ప్రయోజనం పొందాలంటే కచ్చితంగా ఆధార్ కావాల్సిందే. ఆధార్‌ను జారీ చేసే ప్రభుత్వ సంస్థ యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) ఇప్పుడు పుట్టిన బిడ్డకు కూడా ఆధార్ కార్డును తయారు చేస్తుంది. దీంతో కార్డులో చాలా తప్పులు దొర్లుతున్నాయి. దీని కారణంగా ముఖ్యమైన పనులు పెండింగ్‌లో పడుతున్నాయి. అందుకే ఆధార్ అప్‌డేట్‌ చేసుకోవడం చాలా ముఖ్యం. అయితే ఆధార్ అప్‌డేట్ అనేది ఆన్‌లైన్‌లో అపాయింట్ మెంట్ బుక్ చేయడం ద్వారా తొందరగా జరుగుతుంది. కానీ ఈ పనిని ఆఫ్‌లైన్‌లో కూడా చేసుకోవచ్చు. కానీ కొంచెం ఆలస్యం అవుతుంది. ఆ ప్రాసెస్‌ గురించి తెలుసుకుందాం.

మీరు అపాయింట్‌మెంట్ లేకుండా ఆఫ్‌లైన్‌లో మీ ఆధార్ అప్‌డేట్‌కి ముందుగా ఒక ఫారమ్‌ను నింపాల్సి ఉంటుంది. మీరు ఈ ఫారమ్‌ను ఆధార్ సేవా కేంద్రంలో కూడా పొందుతారు. ఇది కాకుండా, మీరు దీన్ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.ఈ ఫారమ్‌లో మీరు వివరాలన్నింటినీ సరిగ్గా నింపాలి. అన్ని వివరాలను నింపిన తర్వాత మీరు మునిసిపల్ కౌన్సిలర్, ఎమ్మెల్యే, ఎంపీ లేదా మీ ప్రాంతంలోని ఏదైనా గెజిటెడ్ అధికారి దగ్గరికి తీసుకెళ్లాలి. వారు ఫారమ్‌ను ధృవీకరించాలి. తర్వాత మీరు ASKకి వెళ్లి మీ వంతు కోసం వెయిట్ చేయాల్సి ఉంటుంది.

మీ టైమ్‌ వచ్చినప్పుడు అధికారులు మిమ్మల్ని ఆ ఫారం అడుగుతారు. ఏ విషయాలు అప్‌డేట్‌ చేయాలో చెప్పమంటారు. ఆ తర్వాత మీ ఆధార్‌లో చేయాల్సిన సవరణను పూర్తి చేస్తారు. ఫారమ్‌ను విజయవంతంగా సమర్పించిన తర్వాత మీకు రశీదు ఇస్తారు. కొన్ని రోజుల తర్వాత మీ ఆధార్ అప్‌డేట్‌ అవుతుంది. మీకు పోస్ట్ ద్వారా కొత్త ఆధార్ కార్డ్ జారీ అవుతుంది. ఇది కొంచెం లేట్‌ ప్రక్రియ. కానీ పనిమాత్రం పూర్తవుతుంది. ఆన్‌లైన్‌ అవకాశం లేనివాళ్లు ఈ విధానాన్ని పాటించాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories