భారత్ లో రెండు కంపెనీల వ్యాక్సిన్ ట్రైయల్స్ లో ముందున్నాయి: మోడీ

భారత్ లో రెండు కంపెనీల వ్యాక్సిన్ ట్రైయల్స్ లో ముందున్నాయి: మోడీ
x

Narendra Modi (file image)

Highlights

భారత్ లో రెండు కంపెనీల వ్యాక్సిన్ ట్రైయల్స్ లో ముందున్నాయి: మోడీ

కరోనా వైరస్ రికవరి కేసులు మరణాల అంశంలో ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్ మెరుగ్గా ఉందన్నారు ప్రధాని మోడీ. రాష్ట్రాల ముఖ్యమంత్రులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ప్రధాని మోడీ మాట్లాడారు. క‌రోనా టీకా వ‌స్తే, దాని పంపిణీకి సంబంధించిన అంశాల‌పై ప్రణాళికను ప్రధాని సమీక్షించారు. అందరి కలిసి కట్టు ప్రయత్నాల వల్ల దేశంలో కరోనా రికవరి కేసులు ఎక్కువ సంఖ్యలో ఉన్నాయని చెప్పారు. భారత్ లో రెండు కంపెనీల వ్యాక్సిన్ ట్రయల్స్ లో ముందున్నాయని ప్రధాని మోడీ వెల్లడించారు. గ్లోబల్ వ్యాక్సిన్ సంస్థలతో కూడా సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. అయితే ఏ వ్యాక్సిన్ కు ఎంత ధర అనేది నిర్ణయం తీసుకోలేదని ఎన్ని డోసుల వ్యాక్సిన్ అనేది ఇంకా క్లారిటీ రాలేదని వివరించారు.

కరోనా పై ప్రజలు అప్రమత్తతతో ఉండేలా రాష్ట్రాల ముఖ్యమంత్రులు జాగ్రత్తలు పాటించాలని ప్రధాని మోడీ అన్నారు. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందని వ్యాక్సిన్ వచ్చే వరకూ అందరూ జాగ్రత్తలు పాటించాలనీ అన్నారు. వ్యాక్సిన్ పైనా రాజకీయాలు జరుగుతున్నాయన్నారు. ఇప్పుడిప్పుడే సంక్షోభం నుంచి బయటపడుతున్నామని కరోనా పాజిటివ్ రేటు ఎట్టి పరిస్థితుల్లోనూ ఐదు శాతానికి మించకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు. వ్యాక్సిన్ త్వరలోనే వస్తోందని దానికోసం కోల్డ్ స్టోరేజీల ఏర్పాటుపై దృష్టి సారించాలని, వ్యాక్సిన్ ను ముందు ఫ్రంట్ లైన్ వారియర్స్ కు ఇచ్చేలా చర్యలు చేపట్టాలన్నారు. కోవిడ్ కేసులు భారీగా పెరుగుతున్న హర్యానాలో ఏం చర్యలు తీసుకుంటున్నారని ఆ రాష్ట్ర సీఎంని మోడీ అడిగారు గణంకాలతో ఆయన సమాధాన మివ్వడంతో ఫిగర్స్ కాదు.. వాస్తవాలు చెప్పడంటూ చురకలేశారు.

కొవిడ్ వ్యాక్సిన్ అందించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, వైఎస్ జగన్ చెప్పారు. ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్ లో తెలంగాణ, ఏపీ సీఎంలు మాట్లాడారు. వ్యాక్సిన్‌ తయారీ, వ్యాక్సినేషన్‌ ముందుగా ఎవరికి ఇవ్వాలి? ప్రాధాన్యతలు, క్షేత్రస్థాయిలో అనుసరించాల్సిన విధానాలు, పంపిణీ సందర్భంలో అనుసరించాల్సిన పద్ధతులపై చర్చించారు. కరోనా వ్యాక్సిన్ కోసం ప్రజలు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారని..శాస్త్రీయంగా ఆమోదం పొందిన వ్యాక్సిన్ రావాల్సిన అవసరం ఉందని తెలంగాణ సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు. ప్రాధాన్యత క్రమంలో ప్రజలకు వ్యాక్సిన్ ను అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేసీఆర్ చెప్పారు. ఇందుకు అనుగణమైన కార్యాచరణ రూపొందించామన్నారు. వ్యాక్సిన్ వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అనే విషయాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉందన్నారు సీఎం కేసీఆర్.

ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్ తర్వాత ఏపీ సీఎం జగన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. వ్యాక్సిన్‌ పంపిణీలో ఎలాంటి పద్ధతులు అనుసరించాలన్న అంశంపై దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు సీఎం జగన్.. వ్యాక్సిన్‌ పంపిణీలో అనుసరించే శీతలీకరణ పద్ధతులు? అందుకు ఎలాంటి మౌలిక సదుపాయాలు ఉండాలి? తదితర అంశాలపై దృష్టి పెట్టాలన సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. నిర్దిష్ట ఉష్ణోగ్రతలో వ్యాక్సిన్‌ను నిల్వ చేయడం, అదే ఉష్ణోగ్రతలో మారుమూల ప్రాంతాలకు వ్యాక్సిన్ ను తరలించడం అన్న రెండు కీలక అంశాలపై ప్రణాలికలు ఉండాలన్నారు. వ్యాక్సిన్‌ సంబంధిత అంశాలపై సమీక్షా సమావేశం ఏర్పాటు చేయాలని సీఎం జగన్ ఆదేశించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories