కాంగ్రెస్ లో చేరిన దివంగత ఐఎఎస్ అధికారి డీకే రవి సతిమణి!

కాంగ్రెస్ లో చేరిన దివంగత ఐఎఎస్ అధికారి డీకే రవి సతిమణి!
x

DK Kusuma Joins Congress

Highlights

DK Kusuma Joins Congress : 2015లో కర్నాటక రాష్ట్రానికి చెందిన ఐఎఎస్ అధికారి డీకే రవి అనుమానస్పద రీతిలో ఆత్మహత్యకి పాల్పడిన సంగతి తెలిసిందే.. అయితే దీనిపైన విచారణ చేప్పట్టిన సీబీఐ రవిది ఆత్మహత్యేనని నిర్ధారించింది.

DK Kusuma Joins Congress : 2015లో కర్నాటక రాష్ట్రానికి చెందిన ఐఎఎస్ అధికారి డీకే రవి అనుమానస్పద రీతిలో ఆత్మహత్యకి పాల్పడిన సంగతి తెలిసిందే.. అయితే దీనిపైన విచారణ చేప్పట్టిన సీబీఐ రవిది ఆత్మహత్యేనని నిర్ధారించింది. ఇక ఇది ఇలా ఉంటే అయన భార్య డీకే కుసుమ ఈరోజు(ఆదివారం) కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. కర్ణాటక పీసీసీ చీఫ్‌ డీకే శివకుమార్‌ సమక్షంలో ఆమె అధికారికంగా కాంగ్రెస్‌ పార్టీలో చేరారు..

ఆమెకి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు డీకే శివకుమార్‌... త్వరలో జరుగనున్న రాజమహేశ్వరీ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఆమెను పార్టీ తరుపున బరిలోకి దించే అవకాశం ఉంది. ఇప్పటికే ఆమె పేరును కాంగ్రెస్‌ పార్టీ హైకమాండ్‌కు సిఫారసు చేసినట్లుగా డీకే శివకుమార్‌ వెల్లడించారు. త్వరలోనే దీనిపైన హైకమాండ్‌ కుడా ఓ నిర్ణయం తీసుకోనుంది..


ఇక పార్టీ కూడా యువ మరియు విద్యావంతులైన అభ్యర్థులను నిలబెట్టాలని చూస్తోందని, అందుకే ఉన్నత విద్యను అభ్యసించిన డీకే కుసుమను ఆ స్థానంలో నిలబెట్టాలనే ఉద్దేశంతోనే పార్టీ ఏకాభిప్రాయంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా డీకే శివకుమార్‌ వెల్లడించారు. అంతేకాకుండా, కుసుమా రాజకీయ కుటుంబం నుండి వచ్చారని, ముందుగా ఆమె తండ్రి హనుమంతరాయప్ప టికెట్ కావాలని కోరినప్పటికీ అతనికి టికెట్ నిరాకరించినట్టుగా అయన వెల్లడించారు.

ఇక ఈ స్థానానికి గాను ఉప ఎన్నికలు నవంబర్ 3 న జరుగుతాయని ఎన్నికల సంఘం మంగళవారం ప్రకటించింది. 2018 లో కాంగ్రెస్ అభ్యర్థి మునిరత్న ఈ స్థానాన్ని గెలుచుకున్నారు. అయితే 2019 లో పార్టీ నుంచి వైదొలిన ఆయన బీజేజెపిలో చేరారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం ఎన్ మునిరత్న పైన అనర్హత వేటు వేసిన తరువాత రాజరాజేశ్వరి నగర్ సీటు ఖాళీగా ఉండిపోయింది

Show Full Article
Print Article
Next Story
More Stories