Himachal Pradesh: హిమాచల్‌ప్రదేశ్‌లో విరిగిపడిన కొండచరియలు

Himachal Pradesh: హిమాచల్‌ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.

Arun Chilukuri
Published on: 11 Aug 2021 4:58 PM IST
Landslide in Himachal Pradeshs Kinnaur
X

Himachal Pradesh: హిమాచల్‌ప్రదేశ్‌లో విరిగిపడిన కొండచరియలు

Himachal Pradesh: హిమాచల్‌ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కిన్నౌర్ జిల్లాలోని రెకాండ్ పియో- సిమ్లా హైవే పై కొండచరియలు విరిగిపడ్డాయి. కొండ చరియల కింద చిక్కుకున్న వాహనాల్లో సుమారు 40 మంది చిక్కుకున్నట్టు తెలుస్తోంది. కిన్నౌర్‌ నుంచి సిమ్లాకు వెళ్తోన్న హిమాచల్ ప్రదేశ్‌ ప్రభుత్వం రవాణాకు చెందిన ఓ ప్రయాణికుల బస్సు, ఓట్రక్కు, కొన్ని కార్లు కొండచరియల కింద చిక్కుకున్నట్టు తెలుస్తోంది. ఘటన స్థలంలో ఆర్మీ, NDRF సిబ్బంది సహాయకచర్యలు ముమ్మరం చేశాయి. కొండపై నుంచి రాళ్లు పడుతుండడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story