Haryana: హరియాణాలో విరిగిపడిన కొండచరియలు

Haryana: మైనింగ్ కార్యకలాపాలు జరుగుతుండగా విరిగిపడ్డ కొండచరియలు

Rama Rao
Published on: 1 Jan 2022 2:46 PM IST
Landslide in Haryana 10 People Missing | Telugu Online News
X

హరియాణాలో విరిగిపడిన కొండచరియలు

Haryana: హర్యానాలో కొండ చరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో అనేక మంది శిథిలాల కింద చిక్కుకున్నారు. మైనింగ్ నిర్వహిస్తున్న వాహనాలు ఆ శిథిలాల కింద చిక్కుకున్నాయి. మైనింగ్ కార్యక్రమాల్లో డజన్ల సంఖ్యలో వాహనాలు నిమగ్నమైనట్లు తెలుస్తోంది. భివానీ జిల్లాలోని తోషామ్ బ్లాక్ వద్ద ఉన్న దాదమ్ మైనింగ్ జోన్‌లో ఈ ఘటన జరిగింది. పదుల సంఖ్యలో క్రేన్లు, డంపర్లు, వాహనాలు ధ్వంసం అయ్యాయి. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. మరోవైపు హర్యానా వ్యవసాయ శాఖ మంత్రి దలాల్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు.

Rama Rao

Rama Rao

Next Story