Land Slide at Badrinath Highway: బద్రీనాధ్ హైవేపై విరిగిపడ్డ కొండ చరియలు.. నిలిచిపోయిన ట్రాఫిక్

Land Slide at Badrinath Highway: బద్రీనాధ్ హైవేపై విరిగిపడ్డ కొండ చరియలు.. నిలిచిపోయిన ట్రాఫిక్
x
Highlights

Land Slide at Badrinath Highway: ప్రస్తుతం దేశ వ్యాప్తంగా వర్షాలు తీవ్రంగా కురస్తున్నాయి.

Land Slide at Badrinath Highway: ప్రస్తుతం దేశ వ్యాప్తంగా వర్షాలు తీవ్రంగా కురస్తున్నాయి. ఇవి అన్ని రాష్ట్రాలకు విస్తరించాయి. ఈ నేపధ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో ఆదివారం ఇల్లు కొట్టుకుపోయిన సంగతి చూశాం. దీంతో పాటు కొండలను ఆనుకుని ఉన్న హైవేలపై కొండ చరియలు విరిగి పడుతున్నాయి. వీటి వల్ల ఆయా ప్రాంతాల్లో రవాణాకు అటంకం ఏర్పడుతోంది. దీంతో ఆ ప్రాంతాల్లో ట్రాఫిక్ నిలిచిపోతోంది. తాజాగా బద్రీనాధ్ జాతీయ రహదారిపై ఇటువంటి ఘటనే చోటుచేసుకుంది. సమీపంలో ఉన్న కొండల నుంచి పెద్ద పెద్ద బండరాయిలు వచ్చి రోడ్డకు అడ్డంగా దొర్లి పడ్డాయి. దీనివల్ల ఎక్కడ వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న ప్రభుత్వం ముందుగా బండలను తొలగించడంతో పాటు రహదారిలో చిక్కుకుపోయిన వారికి ఆహారం అందించాలని ఆదేశించింది.

భారీగా కురుస్తున్న వర్షాలకు అనేక ప్రాంతాలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉత్తరాఖండ్‌ ప్రాంతంలో అయితే నిత్యం కురుస్తున్న భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడుతున్నాయి. దీంతో అనేక ప్రాంతాల్లో రాకపోకలకు తీవ్ర అంతరాయం నెలకొంటుంది. తాజాగా ఆదివారం నాడు కురిసిన భారీ వర్షాలకు బద్రీనాథ్‌ జాతీయ రహదారిపై కొండచరియలు విరిగిపడ్డాయి.భనేర్‌పానీ, పిపల్‌కోటీ ప్రాంతాల్లో ఈ సంఘటన చోటుచేసుకుంది. రోడ్డుపై కొండచరియలు విరిగిపడటంతో ఇరువైపు వాహనాలు వెళ్లేందుకు వీలులేకుండా అయ్యింది. రంగలోకి దిగిన ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు.

ఇరువైపు వాహనాల్లో చిక్కుకుపోయిన వాహనదారులకి ఆహార పదార్థాలను అంజేశారు. కొండచరియలు తొలగించడానికి దాదాపు పన్నెండు నుంచి పదహారు గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు. ఈ రహదారిపై భారీ వర్షాలు కురిసిన ప్రతిసారీ సహజంగానే కొండచరియలు విరిగిపడతాయన్నారు. కాగా,పితోర్‌ఘర్‌ ప్రాంతంలో కూడా భారీ కొండచరియలు విరిగిపడ్డాయి. దార్‌కోట్ ప్రాంతంలోని మున్సిరయి మిలం మార్గ్ వద్ద పెద్ద పెద్ద కొండచరియలు విరిగిపడి రోడ్డుపై పడ్డాయి. దీంతో వాహనాదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories