Kushboo: కుష్బూ ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

Kushboo: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి తరుపున పోటీ చేస్తోన్న ఖుష్బూ తన ఆస్తుల వివరాలను ప్రకటించారు.

Kranthi
Published on: 20 March 2021 10:45 AM IST
Kushboo: Do you Know the Value of Khushboos Assets?
X

Kushboo:(ఫైల్ ఇమేజ్)

Kushboo: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి తరుపున థౌజండ్‌ లైట్స్‌ నియోజకవర్గం నామినేషన్‌ దాఖలు చేశారు సినీనటి ఖుష్బూ. ఈ సందర్భంగా నిన్ననామి తన ఆస్తుల వివరాలను తెలియజేసింది. తనకు మొత్తం 40.96 కోట్ల రూపాయల ఆస్తి ఉందని, ఇందులో రూ. 6.39 కోట్ల విలువైన చరాస్తులు, రూ.34.56 కోట్ల విలువైన స్థిరాస్తులతోపాటు 8.5 కేజీల బంగారం, 78 కేజీల వెండి ఉన్నట్టు పేర్కొన్నారు.

కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో...

అలాగే, తన భర్త సుందర్ వద్ద 495 గ్రాముల బంగారం, 9 కిలోల వెండి ఉన్నట్టు తెలిపారు. ఎనిమిదో తరగతి వరకు మాత్రమే చదువుకున్న తన వార్షిక ఆదాయం 1.50 కోట్ల రూపాయలని ఖుష్బూ పేర్కొన్నారు. గతేడాది కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరిన ఖుష్బూ ఎన్నికల బరిలోకి తొలిసారి దిగుతున్నారు.

Kranthi

Kranthi

Next Story