మరో భళ్లాలదేవుడు.. బతికుండగానే విగ్రహాలు ఏర్పాటు

ఎందరో మహనీయుల విగ్రహాలు వారు మరణించిన తర్వాత స్మరించుకోవడానికి ఏర్పాటు చేస్తారు. బతికుండగానే విగ్రహం ఏర్పాటు చుసుకున్న వారిని సినిమాల్లో చూస్తాం.

Samba Siva Rao
Updated on: 14 March 2020 5:12 PM IST
మరో భళ్లాలదేవుడు.. బతికుండగానే విగ్రహాలు ఏర్పాటు
X
Jayanta Naskar

ఎందరో మహనీయుల విగ్రహాలు వారు మరణించిన తర్వాత స్మరించుకోవడానికి ఏర్పాటు చేస్తారు. బతికుండగానే విగ్రహం ఏర్పాటు చుసుకున్న వారిని సినిమాల్లో చూస్తాం. బాహుబలి సినిమాలో భళ్లాలదేవుడి విగ్రహాన్ని అతను బతికి ఉండగానే ఏర్పాటు చేయిస్తాడు. ఇప్పుడు అలాంటి ఘటనే పశ్చిమ బెంగాల్‌లో చోటు చేసుకుంది. జయంత్‌ నాస్కర్‌ తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ముందుస్తుగా తల విగ్రహాలు తయారు చేయించుకున్నారు. 71ఏళ్ల వయసున్న జయంత్‌ నాస్కర్‌కు ప్రాణహాని ఉంది. అలీపూర్‌ జైలు నుంచి ఇటీవల విడుదలైన కొందూ నేరస్తులు తనను చంపుతారేమో అనే భయంతో తన విగ్రహాలు ఏర్పాటు చేసుకున్నారు.

అయితే ఆ ఎమ్మెల్యే చేయించిన విగ్రహాలు చూసిన అభిమానులు ఉత్సహాంతో ఈ ఫోటోలు సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఎమ్మెల్యే జయంత్ ఇంట్లో ఉన్న విగ్రహాలను చూసిన కార్యకర్తలు మొదటి కంగుతిన్నారు. కొందరూ ఇదేం చోద్యం అని నోరువెళ్లబెడితే.. తమ ఎమ్మెల్యే ఏదో ఘణకార్యం చేసినట్లు అత్యుత్సాహం చూపిస్తున్నారు. విగ్రహాలు చూసిన నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు.

Samba Siva Rao

Samba Siva Rao

Next Story