Kolkata: కోల్‌కతాలో జూ.డాక్టర్ హత్యకేసు సీబీఐకి అప్పగింత

Kolkata: సీబీఐ వెంటనే కేసును టేకోవర్ చేయాలన్న కోల్‌కతా హైకోర్టు

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 13 Aug 2024 4:23 PM IST
Kolkata Doctors Rape Murder Probe To Be Transferred To CBI High Court
X

Kolkata: కోల్‌కతాలో జూ.డాక్టర్ హత్యకేసు సీబీఐకి అప్పగింత

Kolkata: కోల్‌కతాలో జూ.డాక్టర్ హత్యకేసుపై కోల్‌కతా హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కేసు విచారణను సీబీఐకి అప్పగించాంటూ ఆదేశాలిచ్చింది. ఆధారాలు ట్యాంపరింగ్ జరిగే అవకాశం ఉందని పిటిషన్లు దాఖలు కావడంతో.. సీబీఐ వెంటనే కేసును టేకోవర్ చేయాలని తెలిపింది కోల్‌కతా హైకోర్టు. రేపు ఉదయం 10 గంటల లోపు కేసు డాక్యుమెంట్లను సీబీఐకి అప్పగించాలంటూ పోలీసులను ఆదేశించింది. ఐదు రోజుల విచారణలో పురోగతి లేదంటూ అసంతృప్తి వ్యక్తం చేసిన హైకోర్టు.. మూడు వారాల్లో విచారణకు సంబంధించిన నివేదిక సమర్పించాలని సీబీఐకి తెలిపింది. ఇక డాక్టర్ అత్యాచారం, హత్య ఘటనలో ఆస్పత్రి నిర్లక్ష్యంపై మండిపడింది హైకోర్టు. ఘటనపై కేసు ఎందుకు నమోదు చేయలేదని ప్రశ్నించింది.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story