Kolkata Doctor Rape and Murder Case: 'మమత బెనర్జీని గద్దె దింపుతాం...: నిరసన ప్రదర్శనలో గర్జించిన 80 ఏళ్ళ మహిళా డాక్టర్

ఆర్ జీ కార్ ఆసుపత్రిలో ట్రైనీ డాక్టర్ పై అత్యాచారం, హత్యకు పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 21 Aug 2024 12:09 PM IST
Kolkata Doctor Rape and Murder Case 80 Year Old Female Doctor Slams Mamata Banerjee
X

Kolkata Doctor Rape and Murder Case: 'మమత బెనర్జీని గద్దె దింపుతాం...: నిరసన ప్రదర్శనలో గర్జించిన 80 ఏళ్ళ మహిళా డాక్టర్

Kolkata Doctor Rape and Murder Case: కోల్ కతా ఆర్ జీ కార్ ఆసుపత్రిలో ట్రైనీ డాక్టర్ పై అత్యాచారం, హత్య ఘటనపై 80 ఏళ్ల మహిళా డాక్టర్ మమత బెనర్జీ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఫేస్ బుక్ లో ఆమె ఓ వీడియోను పోస్టు చేశారు. ట్రైనీ డాక్టర్ ఘటనను నిరసిస్తూ చేపట్టిన కొవ్వొత్తుల ప్రదర్శనలో ఆమె ప్రసంగించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

మమత ప్రభుత్వాన్ని గద్దెదింపుతాం

"నేను 80 ఏళ్ల డాక్టర్ ను. నిల్ రతన్ సిర్కార్ మెడికల్ కాలేజీలో నాది 1962 బ్యాచ్" అని ఆమె చెప్పారు. తాను చదువుకునే సమయంలో కాలేజీలో యూనియన్ ఏర్పాటు చేయాలని కోరుతూ అప్పట్లో ప్రియరంజన్ దాస్ మున్షితో పోరాడిన విషయాన్ని ఆమె గుర్తు చేసుకున్నారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఏం జరుగుతుందో ప్రపంచానికి చాటిచెబుతామన్నారు.

ఆర్ జీ కార్ ఆసుపత్రిలో ట్రైనీ డాక్టర్ పై అత్యాచారం, హత్యకు పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు.

న్యాయం కోసం పోరాటం చేస్తున్న డాక్టర్ల తరపున నేను మాట్లాడుతున్నా... మమత బెనర్జీని తొలగిస్తామని ఆమె చెప్పారు.

ఆర్ జీ కార్ ఆసుపత్రిలో ట్రైనీ డాక్టర్ ఈ నెల 9వ తేదీ తెల్లవారుజామున హత్యకు గురైంది. ఈ ఘటనపై ప్రస్తుతం పలు రాష్ట్రాల్లో వైద్యులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఈ ఆందోళనలకు మహిళా సంఘాలు, పార్టీలు మద్దతుగా నిలుస్తున్నాయి. ఈ అంశాన్ని సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకుంది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story