హిమాచల్‎లో కలకలం.. అసెంబ్లీ గేటుకు ఖలిస్తాన్ జెండాలు...

Khalistan Flags Tied on Himachal Pradesh Assembly Walls and Gates | Live News
x

ఖలిస్తాన్ కలకలం.. అసెంబ్లీ గేటుకు ఖలిస్తాన్ జెండాలు... 

Highlights

Himachal Pradesh: రెచ్చగొట్టే చర్యల్లో భాగంగా పరిగణిస్తున్న హిమాచల్ సర్కార్...

Himachal Pradesh: ఖలిస్తాన్ జెండాలు కలకలం రేపుతున్నాయి. అది కూడా హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ప్రధాన ద్వారానికే ఖలిస్తాన్ జెండాలు కట్టి ఉండడం కలకలం రేపుతోంది. ఈ ఉదయం హిమాచల్‎లోని ధర్మశాలలో నేరుగా అసెంబ్లీ ప్రహరీ గోడకే ఖలిస్తాన్ జెండాలు కట్టి ఉండడం తీవ్ర కలకలం రేపుతోంది. ఖలిస్తాన్ సానుభూతిపరులు రాత్రిపూట ఎప్పుడో వచ్చి కట్టి ఉంటారని అనుమానిస్తున్నారు.

అయితే వెంటనే బ్యానర్లను తొలగించి, ప్రహరీ గోడకు మళ్లీ పెయింటింగ్ వేయించారు. అయితే అసెంబ్లీ దగ్గరే సెక్యూరిటీ లేకపోవడం పైనా చర్చించుకుంటున్నారు. పంజాబ్ లో చెలరేగిపోతున్న ఖలిస్తాన్ సానుభూతిపరులు హిమాచల్ లోనూ బ్యానర్లు కట్టడంతో దీన్ని హిమాచల్ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories