Kerala Makaravilakku Festival 2022: శబరిమలలో మకర జ్యోతి దర్శనం

Kerala Makaravilakku Festival 2022: హరిహర క్షేత్రం శబరి మలలో స్వామియే శరణం అయ్యప్ప అంటూ భక్తిసాగరంలో మునిగిపోయింది.

Arun Chilukuri
Published on: 14 Jan 2022 6:51 PM IST
Kerala Makaravilakku Festival 2022: శబరిమలలో మకర జ్యోతి దర్శనం
X

Kerala Makaravilakku Festival 2022: హరిహర క్షేత్రం శబరి మలలో స్వామియే శరణం అయ్యప్ప అంటూ భక్తిసాగరంలో మునిగిపోయింది. ఆలయానికి ఈశాన్య దిశలో పర్వత శ్రేణుల నుంచి వెలుగులీనుతున్న జ్యోతి దర్శనం ఇచ్చింది. జ్యోతి దర్శనంతో వేలాది మంది భక్తులు పులకించిపోయారు. హరిహర సుతుడైన స్వామి అయ్యప్పను స్మరిస్తూ స్వామియే శరణం అయ్యప్ప అన్న శరణుఘోషలతో శబరిగిరులు ప్రతిద్వనించాయి. కాంతమాల కొండలపై దేవతలు, రుషులు కలిసి భగవంతునికి హారతినిచ్చారు భక్తులు.

అంతకు ముందు పందాళం నుంచి తీసుకు వచ్చిన తురవాభరణాలను ప్రధాన అర్చకులు స్వామి వారికి అలంకరించారు. ఆ తర్వాత మాల మూర్తికి హారతి నిచ్చారు. ఆ వెంటనే చీకట్లను తొలగిస్తూ పొన్నంబలంమేడు పర్వత శికరాల్లో జ్యోతి దర్శనమిచ్చింది. భక్తిభావంతో తన్మయం చెందిన భక్తులు స్వామియే శరణం అయ్యప్ప అంటూ నినాదాలు చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story