అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ .. నవంబర్ 16 నుండి..

అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ .. నవంబర్ 16 నుండి..
x
Highlights

కరోనా వైరస్ ఎక్కడికక్కడ అన్నిటినీ నిలిచిపోయేలా చేసింది. ఈ నేపధ్యంలో ప్రతి ఏటా లక్షలాది మంది భక్తులు తరలివెళ్లె శబరిమల యాత్రకు బ్రేకులు పడతాయని...

కరోనా వైరస్ ఎక్కడికక్కడ అన్నిటినీ నిలిచిపోయేలా చేసింది. ఈ నేపధ్యంలో ప్రతి ఏటా లక్షలాది మంది భక్తులు తరలివెళ్లె శబరిమల యాత్రకు బ్రేకులు పడతాయని భావించారు అందరూ. అయితే, కేరళ ప్రభుత్వం ఈ సంవత్సరం యాత్రను నిర్వహించడానికి అనుమతిస్తున్నట్టు ప్రకటించారు. నవంబర్ 16 నుంచి మండల యాత్రను ప్రారంభిస్తామని ప్రకటించింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులకు కూడా అనుమతి ఇస్తున్నట్టు ట్రావెన్ కోర్ ట్రస్ట్ అధికారులు, కేరళ ప్రభుత్వం సంయుక్తంగా వెల్లడించింది. దీనికి సంబంధించిన విధి విధానాలపై సోమవారం సమావేశమై కీలక నిర్ణయం తీసుకున్నారు. దీంతో దాదాపు రెండు నెలల పాటు శబరి గిరులు అయ్యప్ప నామస్మరణతో మార్మోగనున్నాయి.

వర్చువల్‌ క్యూ విధానం ద్వారా పేర్లు రిజిస్టర్‌ చేసుకున్న వారికే ఆలయంలోకి అనుమతి ఉంటుందని తెలిపారు. పంబానదిలో స్నానాలకు అనుమతి లేదని అన్నారు. దర్శనం తర్వాత వెంటనే భక్తులు వెనక్కి వెళ్లిపోవాలని సూచించారు. కరోనా నేపథ్యంలో నిబంధనలు తప్పనిసరిగా పాటించాల్సిందేనని అధికారులు స్పష్టం చేశారు. విశ్రాంతి గృహాలకు అందుబాటులో ఉండవని చెప్పారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా చూస్తామన్నారు. కోవిడ్ పాజిటివ్ ఉన్నవారిని గుర్తించేందుకు ఏర్పాట్లు చేస్తామన్నారు. మాస్కులు తప్పనిసరిగా ధరించాల్సిందేనని పేర్కొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories