logo
జాతీయం

కేరళ గోల్డ్ స్మ‌గ్లింగ్ కేసుపై రాజకీయ దూమారం.. అసలు ఎవరీ స్వప్న సురేష్?

Kerala Gold Smuggling Case: Swapna Suresh Appears Before ED
X

కేరళ గోల్డ్ స్మ‌గ్లింగ్ కేసుపై రాజకీయ దూమారం.. అసలు ఎవరీ స్వప్న సురేష్?

Highlights

Kerala Gold Smuggling Case: కేరళ గోల్డ్ స్మ‌గ్లింగ్ కేసులో ప్రధాన నిందితురాలు స్వప్న సురేష్ రెండో రోజు ఈడీ విచారణ హాజరయ్యారు.

Kerala Gold Smuggling Case: కేరళ గోల్డ్ స్మ‌గ్లింగ్ కేసులో ప్రధాన నిందితురాలు స్వప్న సురేష్ రెండో రోజు ఈడీ విచారణ హాజరయ్యారు. కొచ్చిలోని ఈడీ కార్యాలయానికి వచ్చిన ఆమెను అధికారులు ప్రశ్నిస్తున్నారు. మొదటి రోజున సుమారు ఆరు గంటలకు పైగా స్వప్న సురేష్ ను ఈడీ అధికారులు ప్రశ్నించారు. గోల్డ్ స్మగ్లింగ్ కేసులో స్వప్న సురేష్ పేరు దేశవ్యాప్తంగా మార్మోగుతోంది. అసలు ఈ స్వప్న ఎవరు?

కేరళలో వెలుగుచూసిన గోల్డ్ స్మగ్లింగ్ వ్యవహారం దేశవ్యాప్తంగా సెన్షేషనల్ గా మారింది. ఈ వ్యవహారంలో బాగా వినిపిస్తున్న పేరు స్వప్న సురేష్. అసలు ఎవరీ స్వప్న సురేష్? గోల్డ్ స్మగ్లింగ్ లో ఆమె పాత్ర ఏంటి? ప్రస్తుతం దేశ, విదేశాల్లో స్వప్న సురేష్ పేరు మార్మోగిపోతోంది. యూఏఈ రాయబార కార్యాలయం మాజీ ఉద్యోగి అయిన స్నప్న తన కాంటాక్టులను తెలివిగా వాడుకుంటూ గల్ఫ్ దేశాల నుంచి బంగారాన్ని కేరళకు స్మగ్లింగ్ చేసింది. డిప్లమాటిక్ వీసాలను అడ్డం పెట్టుకుని ఆమె సాగిస్తున్న వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అయితే, ఆమె సీఎంవోలో కీలక ఉద్యోగి కూడా కావడంతో గోల్డ్ స్మగ్లింగ్ వ్యవహారం కేరళ సీఎం పినరయి విజయన్ మెడకు చుట్టుకుంది.

అబుదాబిలో పుట్టిన స్వప్న సురేష్ అక్కడే పెరిగింది. స్వప్న తండ్రి స్వస్థలం కేరళలోని తిరువనంతపురం సమీపంలో ఉన్న బలరామపురం. స్వప్న తిరువనంతపురంలో రెండేళ్లు పని చేసింది. ఆ తర్వాత 2013లో ఎయిరిండియా సాట్స్ లో జాబ్ వచ్చింది. 2016లో ఆమె అబుదాబీ తిరిగి వెళ్లిపోయింది. ఎయిరిండియా ఉన్నత ఉద్యోగి సంతకం ఫోర్జరీ కేసుకి సంబంధించి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు విచారణ జరుపుతున్న సమయంలో ఆమె వెళ్లిపోయింది. దర్యాఫ్తులో భాగంగా క్రైమ్ బ్రాంచ్ పోలీసులు స్వప్న సురేష్ ను జూన్ లో విచారణకు పిలిచారు. కానీ ఆమె రాలేదు. స్వప్న సురేష్ ను ఇబ్బంది పెట్టొద్దని కేసు విచారణ చేస్తున్న పోలీసులపై ఉన్నతాధికారులు తీవ్ర ఒత్తిడి తెచ్చారు.

స్వప్న సురేష్ యూఏఈ కాన్సులేట్ లో సెక్రటరీగా పని చేసింది. 2019లో ఆ జాబ్ వదిలేసింది. బాధ్యతారాహిత్యంగా ఉన్న కారణంగా ఆమెను విధుల నుంచి తప్పించినట్టు పోలీసుల విచారణలో తెలిసింది. యూఏఈ కాన్సులేట్ లో జాబ్ చేయడం ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది. ఆ సమయంలో పెద్ద, పెద్ద వాళ్లతో పరిచయాలు ఏర్పడ్డాయి. అరబిక్, ఇతర భాషల్లో స్వప్నకు మంచి పట్టు ఉంది. అబుదాబీ నుంచి కేరళకు వచ్చే నాయకులతో పరిచయాలు పెంచుకుంది. కేరళ ఐటీ సెక్రటరీ శివశంకర్ తరుచుగా స్వప్న సురేష్ ప్లాట్ కి వచ్చేవాడని పోలీసుల విచారణలో తెలిసింది.

కేరళ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా, తిరువనంతపురం ఎయిర్ పోర్టులో 2020 జూలై 6న ఒకేసారి 30 కేజీల బంగారం పట్టుపడింది. యూఏఈ నుంచి డిప్లొమాటిక్ పాస్ పోర్టుపై వచ్చిన సరిత్ కుమార్ అనే వ్యక్తి బ్యాగులో ఇది దొరికింది. పట్టుపడిన బంగారం విలువ 15కోట్లు ఉంటుందని అధికారులు తేల్చారు. తాను యూఏఈ రాయబార కార్యాలయం ఉద్యోగినని దబాయించిన అతను చివరికి నిజం కక్కేయడంతో సెన్సేషనల్ క్రైమ్ బయటపడింది.

గోల్డ్ స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడిన సరిత్ కుమార్ ఇచ్చిన స్టేట్ మెంట్ ఆధారంగా కస్టమ్స్, పోలీస్ అధికారులు స్వప్న కోసం గాలింపు ప్రారంభించారు. గతంలో యూఏఈ కాన్సులేట్ లో పనిచేసిన సమయంలోనే స్వప్న పలు ఆరోపణలు ఎదుర్కొన్నారు. ప్రస్తుతం ఆమె కేరళ ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక ఐటీ డెవలప్ మెంట్ ప్రాజెక్టుకు మార్కెటింగ్ అధికారిగా ఉన్నారు. నేరచరిత్ర కలిగిన స్వప్నను ఆ ప్రాజెక్టులోకి తీసుకోవడం వెనుక ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శివశంకర్ ప్రమేయం ఉందని తెలుస్తోంది. సీఎం విజయన్ కు తెలిసే ఆమె నియామకం జరిగిందని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు.

స్వప్న సురేష్ పని చేస్తున్న ఐటీ శాఖను సీఎం పినరయి విజయన్ నే నిర్వహిస్తున్నారు. గతంలో ఆమె సీఎంతో దిగిన ఫొటోలు వైరల్ కావడంతో పాటు తన స్మగ్లింగ్ కలాపాలకు ఆమె సీఎంవో కాంటాక్టులను కూడా వాడుకుంది. గోల్డ్ స్మగ్లింగ్ వ్యవహారంలో సీఎం కార్యాలయానికి నేరుగా సంబంధాలున్నాయని, స్వప్నను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారని బీజేపీ ఆరోపిస్తోంది. ప్రతిపక్ష కాంగ్రెస్ సైతం సీఎం తీరుపై అనుమానాలు వ్యక్తం చేసింది. దీంతో మీడియా ముందుకు వచ్చిన సీఎం విజయన్ స్వప్న సురేష్ నియామకం ఎలా జరిగిందో తనకు తెలియదని చెప్పారు. కేర‌ళ సీఎం విజ‌య‌న్‌తో పాటు ఆయ‌న ఫ్యామిలీ స‌భ్యుల‌పై బంగారం స్మ‌గ్లింగ్ కేసులో సీబీఐ ద‌ర్యాప్తు చేప‌ట్టాల‌ని స్వప్న సురేష్ కోరారు.


Web TitleKerala Gold Smuggling Case: Swapna Suresh Appears Before ED
Next Story