Zika Virus: కేరళలో జికా వైరస్ అలజడి

Zika Virus In Kerala
Zika Virus: జికా బాధితుల సంఖ్య 15కు చేరినట్లు కేరళ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ వెల్లడించారు.
Zika Virus: ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి అనేక రూపాంతరాలు చెందుతూ మానవాళికే ఛాలెంజ్ విసురుతోంది. రోజు రోజూ ఆ మహమ్మారి అనేక రూపాంతరాలు చెందుతూ కొత్త వైరస్ లు పుట్టుకు వస్తూనే ఉన్నాయి. ఇండియాలో కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టకుండానే కేరళను మరో వైరస్ అలజడి సృష్టిస్తోంది. దోమల ద్వారా వ్యాపించే జికా వైరస్ కేరళలో వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే జికా బాధితుల సంఖ్య 15కు చేరినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ ఈ రోజు వెల్లడించారు.
నంతన్‌కోడ్‌కు చెందిన ఓ 40 ఏండ్ల వ్యక్తిలో లక్షణాలు కనిపించడంతో అతని నుంచి నమూనాలు సేకరించామన్నారు. ఆ నమూనాలను అల్లాపూజాలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపించామని.. రిపోర్టులో అతనికి పాజిటివ్ వచ్చినట్లు ఆమె వెల్లడించారు. మిగిలిన 14 మంది తిరువనంతపురానికి చెందినవారని వీణా జార్జ్ పేర్కొన్నారు. జికా కట్టడికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆమె పేర్కొన్నారు.
జికా వైరస్‌పై అప్రమత్తమైంది కేంద్ర ఎయిమ్స్‌కు చెందిన ఆరుగురు నిపుణుల బృందాన్ని కేరళ రాష్ట్రానికి పంపించింది. అక్కడి పరిస్థితులను సమీక్షించడంతో పాటు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి అవసరమైన సాయం అందించనుంది. ఈ బృందంలో సీనియర్ వైద్యులతో పాటు అంటువ్యాధుల నిపుణులు ఉన్నారు. మరోవైపు కేరళ ప్రభుత్వం కూడా జికాపై అలర్ట్ అయింది. వైరస్ వ్యాప్తి చెందకుండా చర్యలు చేపడుతోంది.
రాబోయే ఎన్నికల్లో ఆ ఆరుగురు గట్టెక్కేదెలా?
27 May 2022 9:30 AM GMTతెలంగాణ కాంగ్రెస్‌లో నాలుగు ముక్కలాట.. నాలుగు ముక్కలాటతో క్యాడర్ కన్ఫ్యూజ్ అవుతోందా?
27 May 2022 8:30 AM GMTAtmakur By Election: మేకపాటి ఫ్యామిలీకి షాకిచ్చిన మేనల్లుడు
27 May 2022 7:30 AM GMTశ్రీకాకుళం టీడీపీలో బాబాయ్ Vs అబ్బాయ్
27 May 2022 6:30 AM GMTకుక్కతో స్టేడియంలో వాకింగ్ చేసిన ఐఏఎస్ దంపతుల బదిలీ
27 May 2022 5:48 AM GMTMahbubnagar: ఓ పల్లెను సర్వ నాశనం చేసిన పల్లెప్రగతి పథకం
26 May 2022 3:00 PM GMTయుద్ధానికి సిద్ధం.. కాస్కో కేసీఆర్ అన్నట్లు సాగిన మోడీ ప్రసంగం
26 May 2022 11:30 AM GMT
నిఖత్ జరీన్‌కు హైదరాబాద్ లో ఘన స్వాగతం
27 May 2022 4:00 PM GMTముగిసిన కేటీఆర్ దావోస్ టూర్.. తెలంగాణకు రూ.4,200 కోట్ల పెట్టుబడులు..
27 May 2022 3:45 PM GMTLPG Subsidy: గ్యాస్ వినియోగదారులకి అలర్ట్.. అకౌంట్లో సబ్సిడీ చెక్...
27 May 2022 3:30 PM GMTనారా లోకేష్ సంచలన నిర్ణయం.. వాళ్లకు నో టికెట్స్.. నేనూ పదవి నుంచి...
27 May 2022 3:30 PM GMTWrinkles: 30 ఏళ్ల తర్వాత ముడతలు రావొద్దంటే ఈ చిట్కాలు పాటించండి..!
27 May 2022 2:30 PM GMT