కోవిడ్ కారణంగా కేరళలో మరణించింది ఇద్దరే.. కోలుకున్నవారు చూస్తే..

కోవిడ్ కారణంగా కేరళలో మరణించింది ఇద్దరే.. కోలుకున్నవారు చూస్తే..
x
CM Pinarayi Vijayan
Highlights

కేరళ రాష్ట్రం 100 రోజుల క్రితం భారతదేశంలో మొదటి కరోనావైరస్ కేసులను నివేదించింది.

కేరళ రాష్ట్రం 100 రోజుల క్రితం భారతదేశంలో మొదటి కరోనావైరస్ కేసులను నివేదించింది.అప్పటి నుండి రాష్ట్రంలో 357 కేసులు నమోదయ్యాయి, అయితే కేవలం 2 మరణాలు మాత్రమే ఉన్నాయని సీఎం పినరయి విజయన్ తెలిపారు. అంతేకాదు 97 మంది రికవర్ అయ్యారని.. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 12710 సాంపిల్స్ టెస్ట్ చేసినట్టు ముఖ్యమంత్రి వెల్లడించారు.

ఇదిలావుంటే కేరళలో ఏప్రిల్ 10 న ఉదయం 8:00 గంటల వరకు 12 కొత్త కరోనావైరస్ కేసులు నమోదయ్యాయని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాలు తెలిపాయి. దీంతో కేరళలో మొత్తం కరోనావైరస్ కేసులను 357 కు చేరాయి.

357 కేసులున్న కేరళ.. దేశంలోని అన్ని రాష్ట్రాలు , కేంద్రపాలిత ప్రాంతాల కేసులతో పోల్చుకుంటే 7 వ స్థానంలో ఉంది. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం దేశంలోనే మహారాష్ట్రలో అత్యధికంగా 1364 కేసులు నమోదయ్యాయి.


Show Full Article
Print Article
Next Story
More Stories