Pinarayi Vijayan: ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద కేరళ సీఎం ఆందోళన

Pinarayi Vijayan: కేంద్రం వైఖరికి నిరసనగా కేరళ సీఎం విజయన్ ధర్నా

Jyothi
Published on: 8 Feb 2024 1:55 PM IST
Kerala CM Pinarayi Vijayan Protest at Jantar Mantar in Delhi
X

Pinarayi Vijayan: ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద కేరళ సీఎం ఆందోళన

Pinarayi Vijayan: కేరళ సీఎం పినరయి విజయన్ దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ఆందోళన చేపట్టారు. కేంద్రం వైఖరికి నిరసనగా గురువారం ధర్నా చేశారు. కేంద్రం నుంచి అందాల్సిన నిధుల విషయంలో తమకు అన్యాయం జరుగుతోందంటూ ఆరోపించారు. ఢిల్లీ, పంజాబ్ సీఎంలు అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్ కూడా నిరసనలో పాల్గొని కేరళ ప్రభుత్వానికి తమ సంఘీభావాన్ని ప్రకటించారు.

కేంద్రంలోని మోడీ ప్రభుత్వం సహకార సమాఖ్య వ్యవస్థను బలహీనం చేసిందని కేరళ సీఎం విజయన్‌ ఫైర్ అయ్యారు. కాగా బుధవారం కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ నేతృత్వంలో ఆందోళన చేపట్టి కేంద్రంపై విమర్శలు చేశారు. తాజాగా కేరళ సీఎం కూడా అదే బాటపట్టారు.

Jyothi

Jyothi

Next Story