Kerala CM in Home-Quarantine: స్వీయ నిర్భందంలోకెళ్లిన కేర‌ళ సీఎం

Kerala CM in Home-Quarantine: కేరళ సీఎం పినరయ్ విజయన్ హోం క్వారంటైన్‌లోకి వెళ్లిపోయారు. అత‌నితో పాటు ఉన్న ఇత‌ర అధికారులు కూడా హోం క్వారంటైన్‌కు వెళ్లిన‌ట్టు తెలుస్తుంది.

Karampoori Rajesh
Updated on: 14 Aug 2020 7:53 PM IST
Kerala CM in Home-Quarantine: స్వీయ నిర్భందంలోకెళ్లిన  కేర‌ళ సీఎం
X
Kerala CM Pinarayi Vijayan in Home-quarantine

Kerala CM goes into Home-Quarantine: కేరళ సీఎం పినరయ్ విజయన్ హోం క్వారంటైన్‌లోకి వెళ్లిపోయారు. అత‌నితో పాటు ఉన్న ఇత‌ర అధికారులు కూడా హోం క్వారంటైన్‌కు వెళ్లిన‌ట్టు తెలుస్తుంది. ఇటీవ‌ల జ‌రిగిన కోజికోడ్‌ విమాన ప్రమాదం ఎంతటి విషాదాన్ని మిగిల్చిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నాటి విమాన ప్రమాదంలో ఇద్దరు పైలెట్లు సహా 18 మంది మరణించారు. అయితే తాజాగా శుక్రవారం మరోక షాకింగ్ విష‌యం తెలిసింది.

ప్రమాద స్థలాన్ని సందర్శించిన అధికారుల్లోనూ పలువురు కరోనా బారినపడ్డారు. ముఖ్యమంత్రి పినరయి విజయన్ కూడా ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. సీఎం వెంట జిల్లా కలెక్టర్, పలువురు ఉన్నతాధికారులు ఉన్నారు. అధికారులకు కరోనా సోకిన విషయం తెలియగానే సీఎం విజయన్‌తో పాటు పలువురు అధికారులు హోం క్వారంటైన్‌లోకి వెళ్లిపోయారు.

మరోవైపు శనివారం జరిగే స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కదకంపల్లి సురేంద్రన్‌ జాతీయ జెండాను ఎగురవేయనున్నారు. ఈ విషయాన్ని కేరళ సీఎం కార్యాలయం వెల్లడించింది.

Karampoori Rajesh

Karampoori Rajesh

Next Story