Arvind Kejriwal: మాట నిలబెట్టుకున్న కేజ్రీవాల్‌.. ఆటో డ్రైవర్‌ ఇంటికి వెళ్లి భోజనం

Arvind Kejriwal: ఎన్నికల ప్రచారంలో గుజరాత్ లో పర్యటిస్తున్న ఆప్ అధినేత కేజ్రీవాల్ ను ఓ ఆటోవాలా భోజనానికి ఆహ్వానించారు

Jyothi
Published on: 13 Sept 2022 7:04 AM IST
Kejriwal Eats Dinner at auto Driver House At Ahmedabad
X

Arvind Kejriwal: మాట నిలబెట్టుకున్న కేజ్రీవాల్‌.. ఆటో డ్రైవర్‌ ఇంటికి వెళ్లి భోజనం

Arvind Kejriwal: ఎన్నికల ప్రచారంలో గుజరాత్ లో పర్యటిస్తున్న ఆప్ అధినేత కేజ్రీవాల్ ను ఓ ఆటోవాలా భోజనానికి ఆహ్వానించారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నిక ప్రచారంలో భాగంగా ఆయన గుజరాత్ లో ఎన్నికల్లో ఆప్ విజయం కోసం ఆటోవాలాలతో సమావేశం అయ్యారు. ఆటోవాలాలు పార్టీ గెలుపు కోసం తమవంతు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో లాగా గుజరాత్లోనూ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని సూచించారు. ఈ మీటింగ్ లో ఓ ఆటో వాలా కేజ్రీవాల్ ను తమ ఇంటికి డిన్నర్ కు ఆహ్వానించారు. దీంతో రాత్రి 8గంటలకు ఇచ్చిన మాట ప్రకారం ఆటో డ్రైవర్ ఇంటి వెళ్లి వారితో కలిసి సహపంక్తి భోజనం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Jyothi

Jyothi

Next Story