Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ కేసులో కేజ్రీవాల్‌కు లభించని ఊరట

Arvind Kejriwal: కేజ్రీవాల్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై రేపు తీర్పువెల్లడించనున్న సుప్రీంకోర్ట్

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 12 Sept 2024 8:38 PM IST
The Supreme Court verdict on Kejriwal bail petition will be revealed tomorrow
X

Arvind Kejriwal: కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‍పై రేపు సుప్రీంకోర్టు తీర్పు వెల్లడి

Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించి సీబీఐ నమోదు చేసిన కేసులో కేజ్రీవాల్‌‌కు ఇంకా ఊరట లభించలేదు. ఈ కేసులో ఆయన దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఇటీవల తీర్పు రిజర్వ్‌ చేసింది. దీనిపై శుక్రవారం తీర్పు వెలువరించనుంది. ఈమేరకు సుప్రీంకోర్టు వెబ్‌సైట్‌లో తీర్పు తేదీని వెల్లడించారు. సీబీఐ అరెస్ట్ చేసిన కేసులో తన అరెస్టును సవాల్‌ చేయడంతో పాటు.. బెయిల్‌ కోసం అభ్యర్థిస్తూ కేజ్రీవాల్‌ 2 వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. ఇటీవల దీనిపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. మరోవైపు, కేజ్రీవాల్ బెయిల్‌ అభ్యర్థనను సీబీఐ వ్యతిరేకించింది. ఈ కేసులో బెయిల్‌ కోసం ఆయన సెషన్స్‌ కోర్టుకు వెళ్లకుండా నేరుగా హైకోర్టుకు వెళ్లారని సీబీఐ సుప్రీంకోర్ట్ దృష్టికి తీసుకొచ్చింది. ఇరుపక్షాల వాదనలు విన్న సుప్రీంకోర్ట్ ధర్మాసనం తీర్పును రిజర్వ్‌ చేసింది. రేపు తీర్పును వెల్లడించనుంది.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story