Kedarnath: తెరుచుకున్న కేదార్‌నాథ్ ఆలయ తలుపులు

Kedarnath Temple Doors Are Opened
x

Kedarnath: తెరుచుకున్న కేదార్‌నాథ్ ఆలయ తలుపులు

Highlights

Kedarnath: శివనామస్మరణతో మారుమోగిన పరిసరాలు

Kedarnath: ఉత్తరాఖండ్‌లో ఉన్న ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన కేదారీశ్వరుడి ఆలయ తలుపులు ఈ ఉదయం తెరవబడ్డాయి. ఆచారాలు, వేద మంత్రోచ్ఛారణల నడుమ యాత్రికుల కోసం తలుపులు తెరిచారు.. గుడి తలుపులు తెరిచిన అనంతరం శివయ్యకు తొలి పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డోలు, డప్పుల మోతతో శివ భక్తులు భక్తిపారవశ్యంలో మునిగి తేలారు. ఆలయ దర్శనం పునః ప్రారంభం సందర్భంగా కేదార్‌నాథ్‌ క్షేత్రాన్ని 20 క్వింటాళ్ల పూలతో అలంకరించారు..ఆలయ ప్రాంతం భక్తుల శివనామస్మరణతో మారుమోగిపోయింది.

Show Full Article
Print Article
Next Story
More Stories