Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరోసారి ఎమ్మెల్సీ కవిత పేరు

Delhi Liquor Scam: కవిత ప్రతినిధిగా అరుణ్‌పిళ్లై వ్యవహరించారన్న ఈడీ

Dhatripriya
Published on: 12 Feb 2023 7:55 AM IST
Kavitha Name Once Again In The Delhi Liquor Scam
X

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరోసారి ఎమ్మెల్సీ కవిత పేరు

Delhi Liquor Scam: దేశంలో ప్రకంపనలు సృష్టిస్తోన్న ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ దూకుడు పెంచింది. ఈ కేసులో ఇప్పటికే ఏపీకి చెందిన YCP ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు మాగుంట రాఘవను అరెస్టు చేయగా అతని రిమాండ్ రిపోర్టులో ఎమ్మెల్సీ కవిత పేరును ఈడీ ప్రస్తావించింది. కవిత తరపున అరుణ్ పిళ్లై ప్రతినిధిగా వ్యవహరించారని ఈడీ ఆరోపించింది. మాగుంట రాఘవను కోర్టులో హాజరుపర్చిన సమయంలో ఈడీ సమర్పించిన రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు పేర్కొంది.

ఎన్రికా ఎంటర్‌ప్రైజెస్ పేరుతో మాగుంట రాఘవ లిక్కర్ తయారీ కార్యకలాపాలు సాగిస్తున్నారని రిమాండ్ రిపోర్ట్‌లో ఈడీ పేర్కొంది. ఎన్రికా ఎంటర్‌ప్రైజెస్ ప్రధాన వాటాదారుడిగా రాఘవ ఉన్నారని.. తన తండ్రి మాగుంట శ్రీనివాసులు రెడ్డి ద్వారా రాఘవ ఈ భాగస్వామ్యాన్ని పొందారని తెలిపింది. అయితే ఢిల్లీ మద్యం వ్యాపార కార్యకలాపాలన్నీ రాఘవ నిర్వహించేవారని సంచలన విషయాలను వెల్లడించింది.

ఈడీ ఇచ్చిన రిపోర్టు ప్రకారం మాగుంట రాఘవ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను కూడా కలిసినట్టు తెలుస్తోంది. ఆప్‌కు 100 కోట్లు లంచం ఇచ్చిన సౌత్ గ్రూప్‌లో రాఘవ మాగుంట కీలకమైన వ్యక్తిగా ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. ఎన్రికా ఎంటర్‌ప్రైజెస్ చెన్నైలో ఉండగా రిటైల్, హోల్‌సేల్ కార్యకలాపాలను నిర్వహించడానికి తయారీదారునిగా అనుమతించనందున అతను ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ 2021-22కి విరుద్దంగా మాగుంట ఆగ్రో ఫామ్స్ పేరుతో రెండు రిటైల్ జోన్‌లను నియంత్రించారు.

ఆప్‌నకు ఇచ్చిన ముడుపులను తిరిగి రాబట్టుకునేందుకు ఇండో స్పిరిట్స్ అనే స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటు చేశారు. సౌత్ గ్రూపునకు ఇందులో 65 శాతం వాటా ఉంది. ఈ సౌత్ గ్రూపులో కవితతో పాటు శరత్ రెడ్డి, మాగుంట రాఘవ ఉన్నారు. ఇండోస్పిరిట్‌లో కవిత తరపున అరుణ్ పిళ్లై ప్రతినిధిగా వ్యవహరించారు. హోల్‌సెల్ డీలర్లకు 12 శాతం కమిషన్, రిటైల్ వ్యాపారులకు 185 శాతం కమిషన్ వచ్చేలా మద్యం పాలసీ రూపొందించారు. ఈ కమిషన్‌ను మళ్లించేందుకు ఇండోస్పిరిట్ స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటు చేశారు. కార్టలైజేషన్ ద్వారా అనుచిత లబ్ధి పొందినట్టు ఈడీ రిపోర్టులో పేర్కొంది.

Dhatripriya

Dhatripriya

Next Story