మూడు పాములతో యువకుడు స్టంట్.. ఓ పాము ఆ యువకుడికి షాక్‌ ఇచ్చింది..

Karnataka Young Man Stunt with Three Snakes | Telugu Online News
x

Karnataka: మూడు పాములతో కర్ణాటక యువకుడు స్టంట్

Highlights

Karnataka: వ్యూస్‌, షేర్స్‌ కోసం భయంకరమైన విన్యాసాలు

Karnataka: టీవీలో పాములను చూస్తేనే ఒళ్లు జలదరిస్తుంది. అలాంటిది నిజంగా చూస్తే భయంతో పరుగులు పెడతాం. కానీ ఓ యువకుడు మూడు పాములతో ఓ స్టంట్‌ చేయాలనుకున్నాడు. పాములను ముందు పెట్టుకొని వాటికి ఏదో చెబుతున్నట్టు, వాటిని ఆడిస్తున్నట్టు చేశాడు. ఇంతలో ఆ మూడింట్లో ఓ పాము ఆ యువకుడికి షాక్‌ ఇచ్చింది. ఒక్కసారిగా ఆ యువకుడి కాలుపై కాటేసింది. దీంతో ఆస్పత్రి పాలయ్యాడు ఆ యువకుడు.

కర్ణాటకు చెందిన మాజ్‌ సయ్యద్‌ అనే వ్యక్తి స్నేక్‌ క్యాచర్‌. అతనికి ఓ యూట్యూబ్‌ ఛానల్‌ కూడా ఉంది. అందులో అన్నీ పాములకు సంబంధించిన వీడియోలే ఉంటాయి. యూట్యూబ్‌లో వ్యూస్‌, షేర్స్‌ కోసం ఈ సారి ఆ యువకుడు మరో అదుగు ముందుకేశాడు. మూడు పాముల ఎదుట కూర్చొని వాటిని ఆడించే ప్రయత్నం చేశాడు. తోకలను పట్టుకొని లాగుతూ కదిలిస్తూ ఆడించాడు. ఇంతలో వాటిల్లోని ఒక పాము సయ్యద్‌ను కాటేయడంతో ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. సోషల్‌ మీడియాలో ఈ వీడియో వైరల్‌ కావడంతో నెటిజన్లు భయంకరమైన విన్యాసాలు తగదంటూ సూచించారు. కొన్నిసార్లు ప్రాణాలకే ప్రమాదం ఏర్పడుతుందని హెచ్చరించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories