Raj Bhavan: కర్ణాటక రాజ్‌భవన్‌కు బాంబు బెదిరింపులు.. అప్రమత్తమైన అధికారులు

Raj Bhavan: బాంబ్‌స్క్వాడ్‌తో రాజ్‌భవన్‌ పరిసరప్రాంతాల్లో తనిఖీలు

Shekhar G
Published on: 12 Dec 2023 3:24 PM IST
Karnataka Raj Bhavan Receives Hoax Bomb Threat Call Probe On
X

Raj Bhavan: కర్ణాటక రాజ్‌భవన్‌కు బాంబు బెదిరింపులు.. అప్రమత్తమైన అధికారులు

Raj Bhavan: కర్ణాటక రాజ్‌భవన్‌కు బాంబు బెదిరింపులు వచ్చాయి. గుర్తు తెలియని వ్యక్తి పోలీసులకు కాల్‌ చేసి రాజ్‌భవన్‌పై బాంబులు వేస్తామంటూ హెచ్చరించాడు. దీంతో పోలీసులు వెంటనే అలర్ట్‌ అయ్యారు. రాజ్‌భవన్‌ వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. బాంబును వెతికేందుకు రంగంలోకి దిగారు. బాంబ్ స్క్వాడ్, కే-9 యూనిట్లతో రాజ్‌భవన్‌ పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. అయితే, ఎలాంటి అనుమానాస్పద వస్తువు వారికి కనిపించలేదు. మరోవైపు ఫోన్‌కాల్‌ ఆధారంగా ఆ వ్యక్తిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

Shekhar G

Shekhar G

Next Story