Covid19: క్వారంటైన్‌లో ఎమ్మెల్యే డ్యాన్స్.. వైర‌ల్ వీడియో

Covid19: క‌రోనా బాధితుల్లో ఉత్సాహం నింపేందుకు కర్ణాటక ఎమ్మెల్యే కె.అన్నదాని వినూత్న ఆలోచ‌న చేశారు.

Samba Siva Rao
Published on: 16 May 2021 5:08 PM IST
karnataka mla dances coronavirus quarantine
X

కరోనా వైరస్ 

Covid19: క‌రోనా బారిన ప‌డి జ‌నం ఇబ్బందులు ప‌డుతున్నారు. క‌రోనా పీడ ఎప్పుడు విర‌గ‌డ‌వుతుందా అని ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా ఈ వైర‌స్ బారిన ప‌డిన క‌రోనా బాధితుల్లో ఉత్సాహం నింపేందుకు కర్ణాటక ఎమ్మెల్యే కె.అన్నదాని వినూత్న ఆలోచ‌న చేశారు. కుటుంబ స‌భ్యుల‌కు దూరంగా క్వారంటైన్‌లో ఉంటూ చికిత్స తీసుకుంలున్నారు. మ్మెల్యే కె.అన్నదాని డ్యాన్స్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతోంది.

క‌రోనా బాధితులు ఉల్లాసంగా గ‌డ‌పాల‌ని ఆయ‌న సందేశాన్ని ఇచ్చారు. కాగా, క‌ర్ణాట‌క‌లో ప్ర‌తిరోజు భారీ సంఖ్య‌లో కేసులు న‌మోద‌వుతున్నాయి. మండ్య పట్టణంలోని రవాణా సంస్థ శిక్షణ కేంద్రం క్వారంటైన్‌ కేంద్రంలో కొంద‌రు చికిత్స తీసుకుంటున్నారు. క‌రోనా రోగుల్లో ఉత్సాహం నింపేందుకు సాంస్కృతిక ప్రదర్శన నిర్వహించగా ఇందులో కె.అన్న‌దాని పాల్గొన్నారు. ఆయ‌న‌ స్వతహాగా జానపద గాయకుడు కావ‌డంతో అక్కడ ప‌లు పాట‌ల‌కు డ్యాన్స్ చేయ‌డం అంద‌రినీ అల‌రించింది.

ముఖ్యంగా బెంగ‌ళూరులో ఊహించ‌ని స్థాయిలో కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేప‌థ్యం క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం మ‌హ‌మ్మారి క‌ట్ట‌డికి క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటుంది. లాక్ డౌన్ కూడా విధించింది. మ‌రోవైపు వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ కూడా వేగం చేసింది.



Samba Siva Rao

Samba Siva Rao

Next Story