Karnataka Minister: ఆత్మాహుతి బాంబు ఇవ్వండి..పాకిస్తాన్ వెళ్తా.. మంత్రి కామెంట్స్ వైరల్

karnataka minister remark on pahalgam  terror attack goes viral telugu news
x

Karnataka Minister: ఆత్మాహుతి బాంబు ఇవ్వండి..పాకిస్తాన్ వెళ్తా.. మంత్రి కామెంట్స్ వైరల్

Highlights

Karnataka Minister: పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదుల దాడితో భారత్, పాక్ ల మధ్య ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ ఘటనకు ప్రతీకారంగా దాయాదిని గట్టి...

Karnataka Minister: పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదుల దాడితో భారత్, పాక్ ల మధ్య ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ ఘటనకు ప్రతీకారంగా దాయాదిని గట్టి దెబ్బకొట్టాలని దేశవ్యాప్తంగా డిమాండ్లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా కర్నాటక మంత్రి బీజడ్ జమీర్ అహ్మద్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆత్మాహుతికి బాంబు ఇస్తే పాకిస్తాన్ పోరాటానికి తాను సిద్ధమేనని వ్యాఖ్యానించారు.

పాకిస్తాన్ ఎప్పటికీ భారతదేశానికి శత్రువే. ఆ దేశంతో మనకు ఎలాంటి సంబంధాలు లేవు. ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్ షా అంగీకరించినట్లయితే..ఆ దేశంపై యుద్ధాన్ని ప్రారంభించేందుకు నేను సిద్ధంగా ఉన్నా. ఆత్మాహుతికి నాకొక బాంబు ఇవ్వండి అంటూ ఆయన అన్నారు. అంతకుముందు కూడా పహల్గాం దాడిని మంత్రి తీవ్రంగా ఖండించారు. ఇది చాలా హేయమైన చర్య అని, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడేందుకు మనమంతా ఏకమవ్వాలని ఆయన పిలుపునిచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories