Karnataka: వివాహేతర సంబంధాలపై మంత్రి సంచలన వ్యాఖ్యలు

Karnataka: 'వివాహేతర' సంబంధాలపై కర్ణాటక మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Arun Chilukuri
Published on: 25 March 2021 2:25 PM IST
Karnataka Health Minister Sudhakar Asks MLAs To Take Monogamy Test
X

Karnataka: వివాహేతర సంబంధాలపై మంత్రి సంచలన వ్యాఖ్యలు

Karnataka: 'వివాహేతర' సంబంధాలపై కర్ణాటక మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. దమ్ముంటే ఎమ్మెల్యేలంతా ఏకపత్నీవ్రతులమని నిరూపించుకోవాలని సవాల్‌ విసిరారు. ప్రధానంగా ప్రతిపక్ష కాంగ్రేస్‌ నేత సిద్ధరామయ్య, మాజీ సీఎం కుమార స్వామి,కేపీసీసీ అధ్యక్షులు డీకే శివకుమార్‌ పేర్లను ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించి సవాల్‌ విసిరారు. అయితే అధికార పార్టీ సహా విపక్ష ఎమ్మెల్యేల నుంచి తీవ్రమై విమర్శలు రావడం అదేవిధంగా ఆందోళనకు దిగడంతో మంత్రి తాను చేసిన వ్యాఖ్యలను కాసేపటికే వెనక్కి తీసుకున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story