Lockdown: కర్నాటక ప్రభుత్వం కీలక నిర్ణయం

Lockdown: కరోనా కల్లోలం నేపథ్యంలో కర్నాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Arun Chilukuri
Published on: 26 April 2021 3:23 PM IST
Karnataka Govt Announces Lockdown for 14 days
X

Lockdown: కర్నాటక ప్రభుత్వం కీలక నిర్ణయం

Lockdown: కరోనా కల్లోలం నేపథ్యంలో కర్నాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో రోజురోజుకీ కేసులు భారీగా పెరిగిపోతుండటంతో వైరస్ కట్టడికి లాక్‌డౌన్‌ వైపు అడుగులు వేసింది. రేపట్నుంచి 14రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా లాక్‌డౌన్ విధిస్తూ యడియూరప్ప ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే, నిత్యవసర సరుకుల కొనుగోళ్ల కోసం ఉదయం 6గంటల నుంచి ఉదయం 10గంటల వరకు లాక్‌డౌన్ నుంచి వెసులుబాటు కల్పించింది. ఇక, మే ఒకటి నుంచి 18ఏళ్లు పైబడిన వారందరికీ ఉచితంగానే కరోనా వ్యాక్సినేషన్ అందించాలని కర్నాటక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story