Karnataka Elections 2023: పోలింగ్‌లో ఉద్రిక్తత.. ఈవీఎంలను పగలగొట్టిన గ్రామస్తులు..

Karnataka Elections 2023: కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో విజయపురి జిల్లా మశిబినలలో ఉద్రిక్తత చోటుచేసుకుంది.

Arun Chilukuri
Published on: 10 May 2023 4:36 PM IST
Karnataka Elections 2023 Vijayapura Residents Destroy EVMs, Beat up Staff
X

Karnataka Elections 2023: పోలింగ్‌లో ఉద్రిక్తత.. ఈవీఎంలను పగలగొట్టిన గ్రామస్తులు..

Karnataka Elections 2023: కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో విజయపురి జిల్లా మశిబినలలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈవీఎంలను తీసుకెళ్తుండగా.. ఎన్నికల అధికారిని అడ్డుకున్నారు గ్రామస్తులు. పోలింగ్‌ జరుగుతున్న సమయంలో ఈవీఎంలను ఎక్కడికి తీసుకెళ్తున్నారని నిలదీశారు. అయితే ఎన్నికల అధికారి సమాధానం చెప్పకపోవడంతో గ్రామస్తులు ఆగ్రహానికి గురయ్యారు. ఎన్నికల సిబ్బందిపై దాడి చేశారు. అంతటితో ఆగకుండా ఈవీఎంలను పగులగొట్టారు. వీవీఎం ప్యాట్‌ మిషన్లను రోడ్డుకేసి కొట్టారు. ఎన్నికల సిబ్బంది కారును ధ్వంసం చేశారు మశిబినల గ్రామస్తులు. రంగంలోకి దిగిన పోలీసులు లాఠీఛార్జ్‌ చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story