karnataka drugs racket case : నేడు డోప్ టెస్ట్ ఫలితాలు.. సంజన ఇంట్లో బ్యాంకు చెక్కులు

karnataka drugs racket case : నేడు డోప్ టెస్ట్ ఫలితాలు.. సంజన ఇంట్లో బ్యాంకు చెక్కులు
x
Highlights

డ్రగ్స్ కేసు రోజుకో మలుపు తీసుకుంటోంది. ఈ కేసులో నేడు డోప్ టెస్ట్ ఫలితాలను వెల్లడించనున్నారు దర్యాప్తు అధికారులు. ఈ కేసులో వీఐపీలు..

డ్రగ్స్ కేసు రోజుకో మలుపు తీసుకుంటోంది. ఈ కేసులో నేడు డోప్ టెస్ట్ ఫలితాలను వెల్లడించనున్నారు దర్యాప్తు అధికారులు. ఈ కేసులో వీఐపీలు , వీవీఐపీల పేర్లు బయటికి వస్తున్నాయి. డ్రగ్స్ కేసులో ఇప్పటికే ప్రముఖ హీరోయిన్ రాగిణి ద్వివేదీతో పాటు సంజనాను పోలీసులు అదుపులో తీసుకున్నారు. వీరిపై ఐపీసీ సెక్షన్ 201 కేసు నమోదు చేసిన పోలీసులు.. వారి ఫోన్ల నుంచి సందేశాలు, వాట్సాప్ లను తొలగించి సాక్షాల తారుమారు కు పాల్పడ్డారనే అభియోగలపై కేసు నమోదు చేశారు. మాదకద్రవ్యాలను వినియోగించి శ్రీమంతులు, రాజకీయ నాయకుల సంతానం, నటీనటులతో ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసినట్లు విచారణలో వెల్లడైంది.. నేటితో వీరి పోలీస్ కస్టడీ ముగియనుంది. అయితే రాగిణి, సంజన లను మరో పది రోజుల పాటు విచారణ కోసం కస్టడీకి ఇవ్వాలని నార్కోటిక్ పోలీసుల విభాగం కోర్టును కోరనుంది. మరోవైపు రాగిణి, సంజన లు నేడు మరోసారి బెయిల్ పిటిషన్ వేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. వీరే కాక మాదకద్రవ్యాల వినియోగం కేసులో 20 మంది నటీనటులు పేర్లతో జాబితాను సిద్ధం చేసిన పోలీసులు.. వారినుంచి టెక్నికల్ ఆధారాలు సేకరించారు. బెంగుళూరు జాయింట్ కమిషనర్ సందిప్ పాటిల్ వీరిని ప్రశ్నించారు. కాటన్ పేట పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసులో నేటికి ఎనిమిది మంది నిందితులు పరారీలో ఉన్నారు.

బాలీవుడ్ నటుడు సుశాంత్ రాజ్ పుత్ సింగ్ కేసులో అరెస్టయిన నటి రియా చక్రవర్తికి.. కొందరు కథానాయకులతో సంబంధం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు.. దీంతో పూర్తి ఆధారాలతో విచారణ జరిపేందుకు గాను సిబిఐ, నార్కోటిక్, ఐడి శాఖ అధికారులు సన్నద్ధం అయ్యారు. నటి సంజన ఇంట్లో ఐఏఎస్ అధికారికి సంబంధించిన బ్యాంకు చెక్కులు లభ్యం అయినట్టు తెలుస్తోంది. డ్రగ్స్ కేసు నుంచి తనను కాపాడాలంటూ ఆ ఐఏఎస్ అధికారితో పలుమార్లు సంజనా మాట్లాడినట్లు పోలీసులు విచారణలో గుర్తించారు. విచారణలో వెలుగులోకి వచ్చిన అంశాలతో పాటు రాజకీయ నాయకులు నటుల పేర్లను సీల్డ్ కవర్ లో న్యాయస్థానానికి అప్పగించినట్లు సందీప్ పాటిల్ స్పష్టం చేశారు. డ్రగ్స్ కేసులో విచారణకు హాజరుకావాలని చామరాజ పేట ఎమ్మెల్యే జమీర్ అహ్మద్ ఖాన్, సామాజిక కార్యకర్త ప్రశాంత్ సంబరిగికి నోటీసులు జారీ చేశారు. ఇటు.. డ్రగ్ కేసులో తనకు ఎటువంటి సంబంధం లేదని నటి ఐంద్రిత రాయ్ అంటున్నారు. డ్రగ్స్ పేడలర్ షేక్ ఫాజిల్ తో ఉన్న ఫోటో సామాజిక మాధ్యమాల్లో హల్చల్ కావడంతో ఇంద్రితా రాయ్ వివరణ ఇచ్చారు.. తాను నటించిన సినిమా ప్రమోషన్ సందర్భంగా మాత్రమే క్యాసినోకి వెళ్లాలని... తనకు ఫాజిల్ తో స్నేహమే లేదని ఆమె స్పష్టం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories