డీకే శివకుమార్‌కు కరోనా పాజిటివ్‌

Arun Chilukuri
Published on: 25 Aug 2020 4:00 PM IST
డీకే శివకుమార్‌కు కరోనా పాజిటివ్‌
X

Karnataka Congress Chief DK Shivakumar Tests Positive for coronavirus: కరోనా వైరస్ ఎవ్వరినీ వదలట్లేదు. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు అందరూ కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే పలువురు రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులకు కరోనా సోకగా.. తాజాగా కర్ణాటక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డీకే శివకుమార్ కు కరోనా సోకింది. ఆయనకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో డీకే శివకుమార్ బెంగళూరులోని ఒక ప్రయివేటు ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. నిన్న, ఈరోజు ఆయన వరద ప్రభావిత జిల్లాలైన బెళగావి, బాగల్‌కోట్‌లలో పర్యటించాల్సి ఉన్నప్పటికీ అనారోగ్య కారణాలతో వాయిదా వేసుకుంటున్నట్టు ఆదివారం ట్వీట్‌ చేశారు.

ఈ క్రమంలోనే కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవడంతో పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు తెలుస్తోంది. డీకే కుటుంబ సభ్యులకు కూడా కరోనా పరీక్షలు నిర్వహించారు. తనను కలసిన వారందరూ ఖచ్చితంగా కరోనా పరీక్షలు చేయించుకోవాలని డీకే శివకుమార్ విజ్ఞప్తి చేశారు. కార్యకర్తలు, అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఇప్ప‌టికే క‌ర్ణాట‌క సీఎం య‌డ్యూరప్ప‌, ప్ర‌తిప‌క్ష నేత సిద్ధ‌రామ‌య్య‌లు క‌రోనా బారిన ప‌డి కోలుకున్నారు. క‌ర్ణాట‌కలో మరీ ముఖ్యంగా బెంగుళూరులో కరోనా వైర‌స్ తీవ్ర‌త రోజురోజుకు పెరుగుతుంది.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story