Yediyurappa Tests Negative : కరోనా నుంచి కోలుకున్న యడ్యూరప్ప!

Yediyurappa Tests Negative : కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్పకి కరోనా సోకినా సంగతి తెలిసిందే.. అయనతో పాటుగా అయన కుమార్తెకు

Krishna
Published on: 10 Aug 2020 6:32 PM IST
Yediyurappa Tests Negative : కరోనా నుంచి కోలుకున్న యడ్యూరప్ప!
X
Yediyurappa (File Photo)

Yediyurappa Tests Negative : కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్పకి కరోనా సోకినా సంగతి తెలిసిందే.. అయనతో పాటుగా అయన కుమార్తెకు కూడా కరోనా సోకింది. ప్రస్తుతం అయన కరోనా నుంచి కోలుకున్నారు. సోమవారం అయన ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. యడ్యూరప్పకి కరోనా సోకడంతో అయన ఆయన ఈ నెల 2న మణిపాల్‌ ఆసుపత్రిలో చేరారు. అక్కడ వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకున్నారు.

అక్కడ తాజాగా నిర్వహించిన పరీక్షల్లో ఆయనకి కరోనా నెగిటివ్ అని వచ్చింది. దీనితో అయన ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.. ఇక అంతకుముందు తనని సంప్రదించిన వారంతా పరీక్షలు చేయించుకోవాలని ట్విట్టర్ వేదికగా సూచించిన సంగతి తెలిసిందే.. ఇక యడ్యూరప్ప కరోనా నుంచి బయటపడడంతో పార్టీ శ్రేణులు, కార్యకర్తలు ఉపిరి పీల్చుకున్నారు.

ఇక అటు కర్ణాటకలో కరోనా మహమ్మారి రోజు రోజుకు పెరుగుతూనే ఉంది.. ఇప్పటికే సీఎం యడ్యూరప్పతో పాటుగా, మాజీ సీఎం కాంగ్రెస్‌ సీనియర్‌ నేత సిద్ధరామయ్య కూడా వైరస్‌ బారినపడ్డారు. అలాగే మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా కరోనా బారిన పడ్డారు.. ఇందులో ప్రస్తుతం కొందరు కోలుకోగా, మరికొందరు దవాఖానలో చికిత్స పొందుతున్నారు. ఇక అక్కడ రాష్ట్రంలో 1,78,087 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ కాగా, ఇందులో 80,981 యాక్టివ్‌ కేసులుండగా, 93,903 రికవరీ కేసులున్నాయి. 3,198 మంది కరోనాతో పోరాడి మరణించారు.

Krishna

Krishna

Next Story