Karnataka: కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం.. మతమార్పిడి చట్టాన్ని రద్దు చేసేందుకు కేబినెట్ ఆమోదం

Karnataka Cabinet Decides To Repeal Anti-Conversion Law
x

Karnataka: కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం.. మతమార్పిడి చట్టాన్ని రద్దు చేసేందుకు కేబినెట్ ఆమోదం

Highlights

Karnataka: త్వరలో శాసనసభలో ప్రవేశపెట్టి చట్టాన్ని రద్దు చేయనున్న కర్ణాటక సర్కార్

Karnataka: కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బీజేపీ సర్కారు తీసుకొచ్చిన మతమార్పిడి వ్యతిరేక చట్టాన్ని రద్దు చేయాలని నిర్ణయించింది. ఈ ప్రతిపాదనను కర్ణాటక కేబినెట్‌ ఆమోదించింది. త్వరలో ఈ ప్రతిపాదనను శాసనసభలో ప్రవేశపెట్టి చట్టాన్ని రద్దు చేయనున్నట్లు మంత్రి HK పాటిల్ తెలిపారు. కర్ణాటకలో గత బీజేపీ ప్రభుత్వం మత మార్పిడి వ్యతిరేక చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. బలవంతంగా, తాయిలాలను ఆశచూపి వివాహం చేసుకుంటానని నమ్మించి మతమార్పిడికి పాల్పడితే చట్ట ప్రకారం చర్యలు తీసుకునేలా ఈ చట్టాన్ని రూపొందించారు. బలవంతంగా మత మార్పిడికి పాల్పడితే నాన్‌బెయిలబుల్‌ అరెస్ట్ చేసేలా చట్టాన్ని తీసుకొచ్చారు. 3 నుంచి 10 ఏళ్ల శిక్షతో పాటు 50 వేల రూపాయల వరకు జరిమానా విధించేలా చట్టంలో నిబంధనలు పొందుపరిచారు. అయితే, శాసనమండలిలో ఈ బిల్లు ముందుకెళ్లలేదు. దీంతో గతేడాది మే నెలలో ఆర్డినెన్స్‌ ద్వారా ఆదేశాలను అమల్లోకి తెచ్చారు. ఆ తర్వాత గవర్నర్‌ ఆమోదంతో చట్టాన్ని అమలు చేశారు. ఇప్పుడు కాంగ్రెస్‌ అధికారంలో రావడంతో సిద్ధరామయ్య సర్కారు.. ఈ చట్టాన్ని రద్దు చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories