Tamil Nadu Election 2021: మేనిఫెస్టో విడుదల చేసిన కమల్ హాసన్

Tamil Nadu Election 2021: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపధ్యంలో ఓటర్లపై పొలిటికల్ పార్టీలు ఉచిత వరాల జల్లులు కురిపిస్తున్నాయి.

Arun Chilukuri
Published on: 19 March 2021 7:44 PM IST
Kamal Haasan releases election manifesto
X

Tamil Nadu Election 2021: మేనిఫెస్టో విడుదల చేసిన కమల్ హాసన్ 

Tamil Nadu Election 2021: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపధ్యంలో ఓటర్లపై పొలిటికల్ పార్టీలు ఉచిత వరాల జల్లులు కురిపిస్తున్నాయి. కమల్ హాసన్ నేతృత్వంలోని మక్కల్ నీది మయ్యం సైతం మహిళా ఓటర్లే టార్గెట్‌గా మేనిఫెస్టో ప్రకటించింది. మేనిఫెస్టో విడుదల చేసిన కమల్ గృహిణుల ఆదాయం పెంచుతూ మహిళా సాధికారతకు బాటలు వేస్తామని హామీ ఇచ్చారు. మహిళలు ప్రతినెలా రూ 10వేల నుంచి రూ 15వేల వరకూ సంపాదించుకునేలా వారికి వివిధ నైపుణ్యాలను అందించేలా శిక్షణ ఇప్పిస్తామని చెప్పారు.

మరోవైపు ఎంఎన్‌ఎం మేనిఫెస్టోలో యువతకు 50 లక్షల ఉద్యోగాలను అందుబాటులోకి తీసుకువస్తామని ప్రకటించారు. యువ వాణిజ్యవేత్తలకు రాయితీలు కల్పిస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాలలను అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దుతామని చెప్పారు. ప్రభుత్వ కార్పొరేషన్లలో ఉద్యోగులను వాటాదారులుగా చేర్చితే అవి లాభాలబాట పడతాయని కమల్ వ్యాఖ్యానించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story