భారత 49వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్ ..

Justice Uday Umesh Lalit is the 49th Chief Justice of India
x

భారత 49వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్ ..

Highlights

Justice Uday Umesh Lalit: ఇవాళ ప్రమాణ స్వీకారం చేయించనున్న రాష్ట్రపతి ముర్ము

Justice Uday Umesh Lalit: భారత 49వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్ ఇవాళ బాధ్యతలు చేపట్టనున్నారు. నూతన సీజేఐగా ఆయనతో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్ 1957 నవంబరు 9న జన్మించారు. 1983 జూన్‌లో న్యాయవాద వృత్తిలోకి ప్రవేశించారు. 1985 డిసెంబరు వరకు బాంబే హైకోర్టులో ప్రాక్టీసు చేశారు. ఆ మరుసటి ఏడాది ఆయన సుప్రీంకోర్టులో ప్రాక్టీసు షురూ చేశారు. 2014 ఆగస్టు 13న సుప్రీంకోర్టు జడ్జిగా నియమితులయ్యారు. అనేక కీలక కేసుల తీర్పుల్లో జస్టిస్ లలిత్ కూడా భాగస్వామిగా ఉన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories