ఇంజనీరింగ్‌ విద్యార్థులకి శుభవార్త.. ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు..!

*ఇంజనీరింగ్‌ విద్యార్థులకి శుభవార్త.. ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు..!

Rama Rao
Updated on: 9 Jun 2022 12:26 PM IST
Junior Executive Jobs in Airport Authority of India
X

ఇంజనీరింగ్‌ విద్యార్థులకి శుభవార్త.. ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు..!

AAI Recruitment 2022: ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో 400 ఎయిర్‌పోర్ట్ అథారిటీ జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్) పోస్టులు ఉన్నాయి. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు జూన్ 15 నుంచి అధికారిక వెబ్‌సైట్ aai.aero ద్వారా అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు చేయడానికి చివరి తేదీ 14 జూలై 2022. ఆన్‌లైన్ పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

ఫిజిక్స్, మ్యాథమెటిక్స్‌తో మూడేళ్ల బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సైన్స్ (బీఎస్సీ) లేదా ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ ఉన్న అభ్యర్థులు ఈ జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. వయోపరిమితి గురించి చెప్పాలంటే అభ్యర్థుల గరిష్ట వయస్సు 27 సంవత్సరాలు ఉండాలి. ఇందులో పీడబ్ల్యూడీకి 10 ఏళ్లు, ఎస్సీ/ఎస్టీకి 5 ఏళ్లు, ఓబీసీ (నాన్ క్రీమీ లేయర్) అభ్యర్థులకు 3 ఏళ్లు సడలింపు ఉంటుంది. మరిన్ని వివరాల కోసం మీరు నోటిఫికేషన్‌ను చూడవచ్చు.

అభ్యర్థులు దరఖాస్తు రుసుము రూ. 1000 చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ/మహిళా అభ్యర్థులు రూ.81 మాత్రమే చెల్లించాలి. అయినప్పటికీ AAIలో ఒక సంవత్సరం అప్రెంటిస్‌షిప్ విజయవంతంగా పూర్తి చేసిన శారీరక వికలాంగులు, ట్రైనీలు దరఖాస్తు రుసుము చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది. ఆన్‌లైన్ పరీక్షలో వచ్చిన మెరిట్‌ ఆధారంగా అభ్యర్థులని షార్ట్‌లిస్ట్ చేస్తారు. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్/వాయిస్ టెస్ట్ కోసం పిలుస్తారు. ఇందులో ఎంపికైన అభ్యర్తుల లిస్ట్‌ని AAI వెబ్‌సైట్‌లో ప్రకటిస్తారు.

Rama Rao

Rama Rao

Next Story