బండి సంజయ్‌కు జేపీ నడ్డా ఫోన్.. వర్రీ వద్దు.. మేం చూసుకుంటాం..!

JP Nadda: టీ.బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌కు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఫోన్‌ చేశారు.

Arun Chilukuri
Published on: 3 Jan 2022 3:30 PM IST
JP Nadda on Telangana BJP Chief Sanjay Bandi’s Arrest
X

బండి సంజయ్‌కు జేపీ నడ్డా ఫోన్.. వర్రీ వద్దు.. మేం చూసుకుంటాం..!

JP Nadda: టీ.బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌కు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఫోన్‌ చేశారు. సంజయ్‌ పోలీస్‌ కస్టడీలో ఉన్నారని బండి కార్యాలయ సిబ్బంది నడ్డాకు తెలియజేయగానే ఆయన సంజయ్‌కు ఫోన్‌ చేసినట్లు తెలుస్తోంది. కేసుల విషయంలో బండి సంజయ్‌ని వర్రీ కావొద్దని నడ్డా సూచించినట్లు సమాచారం. అంతేకాదు న్యాయ స్థానంలో పోరాడుతామని సంజయ్‌కు నడ్డా హామీ ఇచ్చారని సమాచారం. మొత్తానికి జాతీయ నాయకత్వం బండి సంజయ్‌ వెంట ఉంటుందని జేపీ నడ్డా తెలియజేశారు.

సొంత కార్యాలయంలో దీక్ష చేస్తున్నా.. సాకులతో అరెస్టు చేశారని జేపీ నడ్డా మండిపడ్డారు. బండి సంజయ్‌ అరెస్టు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని ఆక్షేపించారు. వినాశకాలే విపరీత బుద్ధి అనేలా కేసీఆర్‌ సర్కార్‌ వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. ఉపాధ్యాయుల తరఫున బీజేపీ పోరాటం కొనసాగుతుందని నడ్డా వెల్లడించారు. సత్యం కోసం పోరాడతాం.. కేసీఆర్‌ను ఓడిస్తామని పునరుద్ఘాటించారు. కేసీఆర్‌ సర్కార్‌పై న్యాయపోరాటం కొనసాగిస్తామని పేర్కొన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story