జార్ఖండ్‌ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం.. లీటర్ పెట్రోల్‌పై రూ. 25 త‌గ్గింపు..

జార్ఖండ్‌ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం.. లీటర్ పెట్రోల్‌పై రూ. 25 త‌గ్గింపు..
x

జార్ఖండ్‌ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం.. లీటర్ పెట్రోల్‌పై రూ. 25 త‌గ్గింపు..

Highlights

Jharkhand: నూతన సంవత్సర ప్రారంభం వేళ ద్విచక్రవాహనదారులకు జార్ఖండ్‌ ప్రభుత్వం శుభవార్త తెలిపింది.

Jharkhand: నూతన సంవత్సర ప్రారంభం వేళ ద్విచక్రవాహనదారులకు జార్ఖండ్‌ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. లీటర్‌ పెట్రోల్‌పై 25 రూపాయలు తగ్గిస్తున్నట్లు ఆ రాష్ట్ర సీఎం హేమంత్‌ సోరెన్‌ ప్రకటించారు. తగ్గించిన ధరలు జనవరి 26 నుంచి అమల్లోకి రానున్నట్లు వెల్లడించారు. సీఎం హేమంత్ సోరెన్ తీసుకున్న ఈ నిర్ణ‌యాన్ని అక్క‌డి ప్ర‌జ‌లు స్వాగ‌తిస్తున్నారు.

మ‌రి జార్ఖండ్‌ బాట‌లో మిగ‌తా రాష్ట్రాలు కూడా పెట్రోల్ ధ‌ర‌ల‌ను త‌గ్గిస్తాయా చూడాలి. క‌రోనా మ‌హ‌మ్మారి త‌రువాత ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను బ‌లోపేతం చేసేందుకు పెట్రోల్ ధ‌ర‌ల‌పై ప‌న్నులు పెంచారు. అంతేకాదు, ఒపెక్ ప్లస్ దేశాలు ముడి చ‌మురు ఉత్ప‌త్తిని భారీగా త‌గ్గిస్తూ గ‌తంలో నిర్ణ‌యం తీసుకోవ‌డంతో ధ‌ర‌లు పెరిగిపోయాయి.


Show Full Article
Print Article
Next Story
More Stories