Jharkhand SI Murder: జార్ఖండ్‌లో దారుణం.. మహిళా ఎస్సైని వాహనంతో ఢీకొట్టి చంపిన దుండగులు..

Jharkhand Female Sub Inspector Sandhya Topno Murdered During Vehicle Inspection
x

Jharkhand SI Murder: జార్ఖండ్‌లో దారుణం.. మహిళా ఎస్సైని వాహనంతో ఢీకొట్టి చంపిన దుండగులు..

Highlights

Jharkhand SI Murder: జార్ఖండ్‌లో దారుణం.. మహిళా ఎస్సైని వాహనంతో ఢీకొట్టి చంపిన దుండగులు..

Jharkhand SI Murder: హర్యానాలో మైనింగ్‌ మాఫియా చేతిలో హత్యకు గురైన DSP సురేంద్రసింగ్‌ బిష్ణోయ్ ఘటన జరిగిన కొన్నిగంటల్లోనే మరో దారణం చోటు చేసుకుంది. DSP హత్య తరహాలోనే ఓ మహిళా SIని వాహనంతో తొక్కించి హతమార్చారు. ఈ దారుణ ఘటన జార్ఖండ్‌ రాజధాని రాంచీలో జరిగింది. రాంచీ నగరంలోని టుపుదానా ఔట్‌పోస్ట్‌ ఇంఛార్జ్‌గా సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ సంధ్య టోప్నేబాధ్యతలు నిర్వహిస్తున్నారు. రోజులాగే వాహనాలను తనిఖీలు చేస్తున్నక్రమంలో ఓ వాహనంతో వేగంగా దూసుకొచ్చి SIని తొక్కించారు. పశువులను అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారం రావడంతో ఆమె అక్కడికి వెళ్లారు. ఆ వాహనాన్ని అడ్డుకునే ప్రయత్నంలో ఆమెను అతి పాశవికంగా హత్య చేశారు దుండగులు. నిందితుడిని అరెస్ట్‌ చేసి వాహనాన్ని స్వాధీనపర్చుకున్నారు పోలీసులు.

Show Full Article
Print Article
Next Story
More Stories