Jharkhand: ప్రేమోన్మాది దారుణం.. యువతిపై పెట్రోల్‌పోసి నిప్పంటించిన యువకుడి అరెస్ట్‌

Jharkhand: జార్ఖండ్‌ డుమ్కాలో హై టెన్షన్‌ వాతావరణం నెలకొన్నది.

Arun Chilukuri
Published on: 29 Aug 2022 4:33 PM IST
Jharkhand A woman Dies After Stalker Set Her On Fire
X

Jharkhand: ప్రేమోన్మాది దారుణం.. యువతిపై పెట్రోల్‌పోసి నిప్పంటించిన యువకుడి అరెస్ట్‌  

Jharkhand: జార్ఖండ్‌ డుమ్కాలో హై టెన్షన్‌ వాతావరణం నెలకొన్నది. ఓ ప్రేమోన్మాది చేసిన ఘాతుకంపై ఊరు ఊరంతా ఒక్కటై ఆందోళనకు దిగింది. డుమ్కాలో షారూఖ్‌ హుస్సేన్‌ అనే యువకుడు అంకిత అనే యువతిని కొన్నాళ్లుగా ప్రేమిస్తున్నానంటూ వెంటపడుతున్నాడు. యువతి తిరస్కరిస్తూ వస్తోంది. దీంతో ఉన్మాదిగా మారిన హుస్సేన్‌ యువతిపై పెట్రోల్‌ పోసి నిప్పు పెట్టి పారిపోయాడు తీవ్ర గాయాలైన యువతి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది. కోపోద్రిక్తులైన బంధువులు, గ్రామస్తులు ఆందోళనకు దిగారు డుమ్కాలో భారీ ప్రదర్శన నిర్వహించారు.

పోలీసులపై ఒత్తిడి పెరగడంతో ఉన్మాది షారూఖ్‌ హుస్సేన్‌ను అరెస్ట్‌ చేశారు. హుస్సేన్‌ తమకు అప్పగించాలని తామే శిక్షిస్తామని అంకిత బంధువులు ఠాణా ముందు బైఠాయించడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story