JEE Main 2021: పరీక్షలు వాయిదా

JEE Main 2021: భారత్ లో కరోనా వ్యాప్తి విపరీతంగా ఉన్న నేపథ్యంలో జేఈఈ మెయిన్స్‌ 2021 పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ ప్రకటించింది.

Arun Chilukuri
Updated on: 4 May 2021 5:53 PM IST
JEE Main 2021 May Exam Postponed
X

JEE Main: పరీక్షలు వాయిదా

JEE Main 2021: భారత్ లో కరోనా వ్యాప్తి విపరీతంగా ఉన్న నేపథ్యంలో జేఈఈ మెయిన్స్‌ 2021 పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ ప్రకటించింది. విద్యార్థుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని ఈ పరీక్షలను నేషనల్‌ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) వాయిదా వేసినట్టు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్‌ వెల్లడించారు. మే 24 నుంచి 28వరకు మే సెషన్‌ జేఈఈ మెయిన్స్‌ పరీక్షలు జరగాల్సి ఉంది. తదుపరి అప్‌డేట్స్‌ కోసం ఎన్‌టీఏ వెబ్‌సైట్‌ను సందర్శించాలని విద్యార్థులకు పోఖ్రియాల్‌ విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే నీట్‌ పరీక్ష వాయిదా వేసిన సంగతి తెలిసిందే.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story