జమ్ముకశ్మీర్‌‌కు చెందిన జైళ్ల శాఖ డీజీ హెచ్‌కే లోహియా హత్య

ఇంట్లో పనిమనిషే లోహియాను హత్య చేసినట్లు అనుమానం

Rama Rao
Published on: 4 Oct 2022 11:51 AM IST
Jammu and Kashmir DG Prisons HK Lohia  was Murdered
X

జమ్ముకశ్మీర్‌‌కు చెందిన జైళ్ల శాఖ డీజీ హెచ్‌కే లోహియా హత్య

Jammu and Kashmir: జమ్మూకశ్మీర్‌కు చెందిన జైళ్లశాఖ డైరెక్టర్ జనరల్ హేమంత్ కుమార్ లోహియా హత్యకు గురయ్యారు. అనుమానాస్పద స్థితిలో జమ్మూలోని ఆయన నివాసంలో లోహియా మృతదేహం లభ్యమైందని పోలీసులు తెలిపారు. సంఘటనా స్థలాన్ని ఫోరెన్సిక్‌ నిపుణులు పరిశీలించారు. అయితే, డీజీ ఇంట్లో పని చేసే వ్యక్తే హత్య చేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. పని మనిషి పరారీలో ఉండగా అతని కోసం గాలింపు చేపట్టారు. డీజీ లోహియా హత్యకు గురవడంతో ఆయన కుటుంబం దిగ్భ్రాంతికి గురైంది. లోహియా మరణంపై సీనియర్‌ పోలీస్‌ అధికారులు సంతాపం వ్యక్తం చేశారు. లోహియా 1992 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారి. ఈ ఏడాది ఫిబ్రవరిలో సెంట్రల్‌ డిప్యూటేషన్‌ నుంచి తిరిగి వచ్చారు. జమ్మూకు తిరిగి వచ్చే ముందు BSFలో పని చేశారు. ఆ తర్వాత డీజీపీ హోదాలో పదోన్నతి పొందారు. ఆగస్టులో జమ్మూ కశ్మీర్‌ డీజీపీగా నియామకమయ్యారు.

Rama Rao

Rama Rao

Next Story