Jammu and Kashmir: జమ్ముకశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్

Jammu and Kashmir: జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది.

Arun Chilukuri
Published on: 31 July 2021 7:52 PM IST
Jaish Chief Masood Azhars Nephew Lamboo killed in J&Ks Awantipora Encounter
X

Jammu and Kashmir: జమ్ముకశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్

Jammu and Kashmir: జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. ఇవాళ జరిగిన ఎన్‌కౌంటర్‌లో జైషే మహమ్మద్‌ ఉగ్రముఠాకు చెందిన టాప్‌ కమాండర్‌ లంబూ సహా ఇద్దరు ముష్కరులను భద్రతాదళాలు మట్టుబెట్టాయి. సీఆర్పీఎఫ్‌ జవాన్లపై జరిగిన ఉగ్రదాడిలోనూ ఇతడి హస్తం ఉన్నట్లు అధికారులు తెలిపారు.

పుల్వామాలోని నమిబియన్‌, మర్సార్‌ అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కినట్లు నిఘా వర్గాల నుంచి సమాచారం అందింది. దీంతో భద్రతాబలగాలు ఈ ఉదయం కార్డన్‌ సెర్చ్‌ చేపట్టాయి. భద్రతా సిబ్బంది తనిఖీలు చేస్తుండగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో జవాన్లు ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ముష్కరులు హతమైనట్లు అధికారులు వెల్లడించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story