రైల్వేలో ఉద్యోగాలు.. ఇంజనీరింగ్‌, డిప్లొమా చదివిన వారికి అవకాశం..

jabalpur railway invites applications for various posts
x

రైల్వేలో ఉద్యోగాలు.. ఇంజనీరింగ్‌, డిప్లొమా చదివిన వారికి అవకాశం..

Highlights

రైల్వేలో ఉద్యోగాలు.. ఇంజనీరింగ్‌, డిప్లొమా చదివిన వారికి అవకాశం..

Railway Recruitment 2022: ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూసే నిరుద్యోగ యువతకి ఇది సువర్ణవకాశం అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇంజనీరింగ్‌, డిప్లొమా చదివిన విద్యార్థులు కొంచెం కష్టపడితే ఉద్యోగం సాధించవచ్చు. ఇండియన్‌ రైల్వే పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన జబల్‌పూర్‌ ప్రధాన కేంద్రంగా ఉన్న వెస్ట్ సెంట్రల్‌ రైల్వే పలు పోస్టులను భర్తీ చేయనుంది. కాంట్రాక్ట్‌ విధానంలో ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలో తెలుసుకుందాం.

నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 20 పోస్టులని భర్తీ చేస్తున్నారు. వీటిలో జూనియర్‌ టెక్నికల్‌ అసోయేట్‌, జూనియర్‌ టెక్నికల్‌ అసోయేట్‌ పోస్టులు ఉన్నాయి. పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఇంజనీరింగ్ డిగ్రీ/ డిప్లొమా (సివిల్‌ ఇంజీనిరింగ్‌) ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్థుల వయసు పోస్టులను అనుసరించి 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులను మొదట స్క్రీనింగ్, ఆ తర్వాత పర్సనాలిటీ టెస్ట్‌ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు ఒక ఏడాది కాంట్రాక్ట్‌ కాలవ్యవధిలో పని చేయాల్సి ఉంటుంది. దరఖాస్తుల స్వీకరణకు 17-03-2022ని చివరి తేదీగా నిర్ణయించారు. పూర్తి వివరాల కోసం రైల్వే వెబ్‌సైట్ సందర్శించండి.

Show Full Article
Print Article
Next Story
More Stories