PSLV-C56: ప్రయోగాల పరంపర కొనసాగిస్తున్న ఇస్రో.. రేపు ఉదయం పీఎస్‌ఎల్‌వీ - సీ 56 రాకెట్ ప్రయోగం..

PSLV-C56: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ప్రయోగాల పరంపరను కొనసాగిస్తోంది.

Arun Chilukuri
Published on: 29 July 2023 11:58 AM IST
ISRO to Launch  PSLV-C56 on Sunday
X

PSLV-C56: ప్రయోగాల పరంపర కొనసాగిస్తున్న ఇస్రో.. రేపు ఉదయం పీఎస్‌ఎల్‌వీ - సీ 56 రాకెట్ ప్రయోగం..

PSLV-C56: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ప్రయోగాల పరంపరను కొనసాగిస్తోంది. PSLV సీరీస్‌లో మరో ప్రయోగానికి సిద్ధమైంది. రేపు PSLV - C 56 రాకెట్‌ను ప్రయోగించేందుకు తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని షార్ సన్నద్ధమైంది. నేటి ఉదయం 5గంటల ఒక నిమిషానికి కౌంట్ డౌన్ మొదలైంది.

తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ అంతరిక్ష కేంద్రం నుంచి రేపు ఉదయం 6 గంటల 31 నిమిషాలకు PSLV - C 56 రాకెట్ నింగిలోకి ఎరగనుంది. ఈ రాకెట్ ద్వారా సింగపూర్‌కు చెందిన ఏడు ఉపగ్రహాలను ఇస్రో శాస్త్రవేత్తలు రోదసిలోకి పంపనున్నారు. డీఎస్ - షార్ ఉపగ్రహం ఇందులో ప్రధానమైనది. దీంతో పాటు వెలాక్స్ AM, ARCADE, SCOOT - టూ, నులియన్, గెలాసియా - టూ, ORB - ట్వెల్వ్ ఉపగ్రహాలను ఈ రాకెట్ మోసుకెళ్లనుంది. షార్ డైరెక్టర్ ఆర్ముగం రాజరాజన్ అధ్యక్షతన లాంచింగ్ ఆథరైజేషన్ బోర్డు సమావేశమై... ప్రయోగానికి సంసిద్ధత తెలిపింది. కౌంట్ డౌన్ ముగియగానే షార్‌లో‌ని మొదటి ప్రయోగ వేదిక నుంచి PSLV - C 56 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story